Bluepadప్రతీ ఒక్కరికి గుర్తుంది పోయేవే స్కూల్ డేస్
Bluepad

ప్రతీ ఒక్కరికి గుర్తుంది పోయేవే స్కూల్ డేస్

G
Gayathri
15th May, 2020

Share




కానీ జీవితానికి పునాది వేసేది బడి మాత్రమే. పాఠశాలలో నేర్చుకునేవి నిజంగా పునాదులే. విద్యని అప్పుడు నేర్పించడం బట్టే ప్రతి ఒక్కరు కూడా జీవితం లో ఉన్నత శిఖరాలను అవరోధించే స్థాయికి చేరగలరు. ఒకరితో ఒకరు పోటీ తత్వం , అలానే నమ్మకం, సెల్ఫ్ ఎస్టీం, కాన్ఫిడెన్స్, కష్టపడే తత్వం, గెలుపోటములు ప్రయత్నం, ఇలా ఎన్నో నేర్పిస్తారు అప్పటి మాస్టార్లు. ఏవైనా చిన్న చిన్న పోటీల్లో పాల్గొనడం లేదా స్పోర్ట్స్ మీట్ వంటివి జరగడం ఇలా అనేకం బడిలో నేర్పిస్తారు.

ఎన్నిసార్లు గెలుచుకున్న తిరిగి రావు ఆ రోజులు నిజంగా ఆ వయసులో ఆ రోజుల్లో ఏదో మాయ ఉంటుంది. అందుకేనేమో బాగా గుర్తుండిపోతాయి. పాఠశాల రోజులకి కళాశాల రోజులకి చాలా తేడా ఉంటుంది అప్పుడు చేసేవి ప్రతిదీ కూడా చాలా ఆనందంగా ఎంతో మధురం జ్ఞాపకంగా ఉంటాయి కానీ కళాశాలకు వచ్చే సరికి అల్లర్లు కానీ ఆనందాలు కానీ ఉండవు
అంతేకాకుండా పాఠశాలలో ఉన్నప్పుడు చదువులో కానీ ఆటల్లో గాని ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఒకరి నోట్స్ రాయడం ఇలా సహాయం చేసుకోవడం కూడా పాఠశాలలో నేర్చుకున్నదే. అలానే మంచి విషయాలు నీతి న్యాయం నిజాయితీ వంటివి పాటించడం ఒకరికొకరు నీతులు చెప్పుకోవడం నిజాయితీ గా ఉండాలని మరొకరికి నేర్పించడం ఇటువంటి కూడా అప్పట్లో మొదలైనవే కానీ అప్పట్లో స్కూల్ కి వెళ్లడం ఇష్టం లేకుండా స్కూల్ ని ద్వేషించడం ఎంతోమంది చేసినదే. కానీ పాఠశాలకి అప్పుడు వెళ్లకపోయినా అప్పుడు ఏడ్చినా ఇష్టం లేకున్నా ఆరోజు మాత్రం నిజంగా మంచి పునాది కట్టాయి అనే చెప్పొచ్చు పాఠశాలలో ఏం మర్చిపోయిన మర్చిపోక పోయినా వెళ్లిన ట్రిప్స్ ఎక్స్కర్షన్స్ వంటివి గుర్తుండిపోతాయి. ప్రతి ఒక్కరి జీవితం లో ఫలానా చోటికి వెళ్ళాము ఫలానా వారితో ఇలా ఉన్నాము అని గుర్తుండిపోతాయి

నిజంగా అపురూప సన్నివేశాలు లాగ అవి హృదయంలో నాటుకు పోతాయి కాబట్టి పాఠశాల రోజులు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అలానే మధ్యలో వెళ్లిపోయిన స్నేహితుల కోసం బాధ పడడం వారిపై ఉన్న ఫ్రెండ్షిప్ ని మిస్స్ అవడం వంటివి జరిగినవే. మొదటిరోజు పాఠశాలలో ఉన్న రోజు వేరు చివరి రోజు ఉన్న పాఠశాలలో రోజు వేరు. మొదట వెళ్లడానికి బాధ వేసేది తర్వాత విడిచిపెట్టడానికి బాధ కలిగేది ప్రతి ఒక్కరి చెప్పే విషయమే.

కాబట్టి జీవితంలో ఎన్ని అడుగులు వేసిన ఎంత ఎత్తుకు వెళ్ళిన ఏ స్థాయికి చేరుకున్న తిరిగి పాఠశాల రోజులు గుర్తొస్తున్నాయి ఉంటాయి. ఎక్కడో దూర ప్రదేశాలకు వెళ్లి పోయినా ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరు కూడా ఆ స్కూలు రోజుల్ని మర్చిపోరు పదే తలుచుకుంటూ ఉంటారు. కాబట్టి నిజంగా పాఠశాల అనేది ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటుకు పోయేదే.

16 

Share


G
Written by
Gayathri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad