Bluepadథాంక్స్
Bluepad

థాంక్స్

Vishnu
Vishnu
15th Sep, 2020

Share


ఎప్పుడైనా ఆలోచించావా?
కవితలకు నీరాతలకు కారణమైన అక్షరాలనైతే మెచ్చుకున్నావు, మరి ఆ అక్షరాలకు కారణమైన వాటికి ఎప్పుడైనా థాంక్స్ చెప్పావా..!
నా జ్ఞాపకాలకు నా అక్షరాలకు ఆ అక్షరాలకు కారణమైన... చెట్టుకి పుట్టకి, పక్షికి గూటికి, లేడికి, లేగదూడ పిల్లకి థాంక్స్... వీచే గాలులకు, మారే ఋతువులకు కూసే కోయిలకు, పచ్చని వసంతానికి థాంక్స్.. తొలకరి చినుకుకు, మట్టి వాసనకు నాగలిపట్టే అన్నదాతకు, పొలందున్నే కాడెద్దులకు థాంక్స్ .. మట్టి పలకకు, బడి గంటకు పుల్ల ఐసుకు, పీచు మిఠాయికి థాంక్స్.. ఎగిరే గాలిపటానికి, తిరిగే బొంగరానికి రంగులరాట్నానికి, దూకేటి జలపాతానికి థాంక్స్.. సముద్ర ఘోషకు, నక్షత్ర చేపకు ఎగిసే అలలకు, కురిసే వానకు థాంక్స్.. పున్నమి చంద్రుడికి, పుడమి తల్లికి వర్షించే మేఘానికి, వెన్నెల కాంతికి థాంక్స్... చుక్కలకి, చంద్రుడికి నడిరేయికి, కమ్మని కలలకి థాంక్స్... కోడి పందేలకు, సంక్రాంతి ముగ్గులకు డు డు బసవన్నకు, పి పి సన్నాయికి థాంక్స్.. కరి మబ్బుకు, నీలి కురులకు కాటుక కనులకు, కొంటె చూపులకు థాంక్స్.. పదహారణాల పడుచుపిల్లకి కన్నెపిల్ల కొంటేతనానికి థాంక్స్... తొలి ప్రేమకు, ఎద సడులకు ఎర్రటి పెదవులకు, తొలి ముద్దుకు థాంక్స్... బాపు గారికి, బాపు బొమ్మకు శ్రీశ్రీ గారికి, సిరివెన్నెలకు థాంక్స్... అమ్మచేతిముద్దకు, అందాలజాబిల్లికి జోలపాటకు, చిరుగాలికి థాంక్స్... ఆవకాయ ముద్దకి, బంగారు బామ్మకు వేసవి సెలవులకు, అమ్మమ్మగారింటికి థాంక్స్.. తెలుగింటి మర్యాదలకు, గోదారి రుచులకు దుర్గమ్మ దీవెనలకు, కృష్ణమ్మ పరవళ్లకు థాంక్స్.. పూతరేకులకు, పులస చేపకు కాకినాడ కాజాకు, తిరుపతి లడ్డుకు థాంక్స్... జామపండుకు, రామచిలుకకి రేగిపండుకు, తేనెపట్టుకి థాంక్స్.. నాన్న తెచ్చిన చెక్కబొమ్మకు, సైకిల్ కొనిపెట్టిన నాన్నకు పెద్ద థ్యాంక్స్...

15 

Share


Vishnu
Written by
Vishnu

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad