Bluepadఅడుగడుగునా బహురూపులు
Bluepad

అడుగడుగునా బహురూపులు

V
Valipe Raghavenderrao
12th Sep, 2020

Share

-: అడుగడుగునా బహు రూపులు :-

అడుగడుగున బహురూపులు
బరితెగించి తిరుగుతున్నారు
ఎటుబోయినా అటు వీరలె

పనీ పాట లేని ఊర విడిచిన ఆబోతులు
పరుల కూడి చెరచుతుందురు

మనిషి ముందు నీవే గొప్పంటారు
చాటున చెడుగా చెపుతుంటారు
పరుల గొప్ప ఒప్పుకోరు
లేని తమ గొప్పల చాటుతుందురు
పైనిండా అవలక్షణాలు
పడేవేమో బహు బడాయీలు
సోకులు పలు డాబులు
పరుల వాడి వదిలేయుటలో
వీళ్ళు పి.హెచ్.డీ గాళ్ళు.

సంఘాలు, సమాజాలు పలు పరిచయాలు
ఫ్లేక్సీలు,బ్యానర్లు, ఫేసు బుక్ ఫోటోలు
వాట్సప్ చాటింగులు మీటింగ్ లు
అన్నీ అవన్నీ వీరి మోసపు పలు పరికరాలు
కీర్తీ వ్యామోహం, ధన సంపాదనె తమ అంతిమ నైజం
నమ్మరాదు బహురూపుల నమ్మరాదు స్వార్థ పరుల
పాడు చేసుకొనరాదు తమ డబ్బుల
విలువ గల తమ సమయంబుల .

0 

Share


V
Written by
Valipe Raghavenderrao

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad