Bluepad | Bluepad
Bluepad
రాయలసీమ ప్రజలు మోస పోయారా? మోసపోతున్నార?చరిత్ర నుండి నేర్వాని పాఠాలు.
Ram Rj
Ram Rj
5th Aug, 2020

Share

చరిత్ర నుండి నేర్వని పాఠాలు - దగాపడ్డ, దగాపడుతున్న రాయలసీమ

రాయలసీమ ప్రజలు మోస పోయారా? మోసపోతున్నార?చరిత్ర నుండి నేర్వాని పాఠాలు.


తల్లికోట యుద్ధం ముగిసింది. విజయనగర సామ్రాజ్యం ఓడిపోయింది. గండికోటకి మహావీరుడు పెమ్మసాని చిన్న తిమ్మానాయుడు పాలకుడుగా ఉన్నాడు. గోల్కొండ నవాబు ఆదేశాలతో సిద్దవటం కోటను గెలిచి తరువాత గండికోట పై దండెత్తి వచ్చాడు మీర్ జుమ్లా.. గండికోట తలవంచలేదు. రామబాణం మాధవబాణం బురుజుల మీద నుండి ఫిరంగులతో విరుచుకుపడ్డారు. ఎన్ని ప్రయాత్నాలు చేసినా గండికోటను బలంతో గెలుచుకోవడం కుదరదని కుటిల నీతికి తెరలేపాడు మిరుజుమ్లా. పెమ్మసాని వారి ఆస్థానంలో ఉన్నతాధికారి పొదిలి లింగన్నతో రాయబారం పంపాడు. గండికోటను అప్పగిస్తే దానికి బదులు గుత్తికోటను ఇస్తానని. తనకన్నా ఎన్నో రెట్లు శక్తివంతుడైన శత్రువును ఎన్నో రోజులు నిలువరించలేమని, తనను నమ్ముకున్న వారి మేలుసుకోసం చిన తిమ్మానాయుడు అందుకు అంగీకరించాడు. గండికోటను అప్పగించగానే మీర్ జుమ్లా తన అసలు బుద్ది చూపించాడు.. తాను ఇస్తానన్నది గుత్తి కోట కాదని కేవలం హనుమన గుత్తి గ్రామం మాత్రమే అని మాట మార్చాడు. పెమ్మసాని చిన్న తిమ్మానాయుడిని చంపించాడు. వారి పారివారాన్ని ఖైదు చేయించాడు.. ఆ విధంగా గండికోట పాలకులు నమ్మి మోసపోయారు.

ఇది జరిగి దాదాపు 300 సంవత్సరాల అనంతరం మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారంతా కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆర్థికంగా, విద్యాపరంగా మరియు అన్నిరకాలుగా కోస్తా వారికంటే వెనుకబడిన రాయలసీమ వారు సహజంగానే ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు దక్షిణాది వారు (తమిళులు) పెత్తనం చెలాయిస్తున్నారు, ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉత్తరాది వారు(కోస్తా వారు) పెత్తనం చెలయిస్తారు అని కొందరు పెద్దలు గట్టిగా వాదించారు. వారి అనుమానాలు నివృత్తి చేయడానికి పెద్దలంతా కలిసి శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం అంతకంతకూ బలమవుతూ వచ్చింది.. దాంతో పాటే ఏర్పడబోయే రాష్ట్రం మీద సీమ వారికి కూడా అనుమానాలు పెరుగుతూ పోయాయి. శ్రీబాగ్ ఒప్పందాన్ని రాజ్యాంగంలో చేర్చి భద్రత కల్పించాలి అని కొందరు పెద్దలు వాదించారు. అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మబలిదానం అనంతరం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు దాదాపు ఖాయం అయ్యింది. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని రాయలసీమలో పెట్టకుంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సీమ ప్రతినిధులు ససేమిరా అన్నారు. ఎలాగైనా రాష్ట్రం ఏర్పడాలి అని . ప్రకాశం పంతులు రాజధాని కర్నూలు లో ఏర్పడుతుంది అని ప్రకటించారు.

అంత ఉదారంగా రాజధానిని రాయలసీమకు ఇవ్వడం వెనుక రాయలసీమ మీద ప్రేమ ఏమాత్రం కాదు. కర్నూలు రాజధానిగా ఎంపిక చేసిన తరువాత తీవ్ర నిరశన తెలిపిన కోస్తా ప్రజాప్రతినిధులతో ప్రకాశం పంతులు ఏమన్నారో చూడండి. “కర్నూలు శాశ్వత రాజధాని కాదు. ఇది తాత్కాలికమైనది. త్వరలో విశాలాంధ్ర రాగలదన్న విశ్వాసం ఉన్నది. అప్పుడు మన శాశ్వత రాజధానిగా హైదరాబాదు ఉంటుంది.అది 2 లేదా 3 ఏండ్ల కంటే పట్టదు కూడా అని”.(మూలం: ఆంధ్రోద్యమ చరిత్ర)

ఇప్పటికి శ్రీబాగ్ ఒప్పందంలో నెరవేరిన అంశం ఏదైనా ఉంది అంటే అది రాజధాని ఒకటే (తూతూ మంత్రం గా అనంతపురంలో ఏర్పాటైన యూనివర్సిటీ కాకుండా) అది కూడా సీమవారిని మభ్యపెట్టే ప్రయత్నం. రాజధాని ఎలాగూ హైదరాబాదుకు తరులుతుంది అని తెలుసు కాబట్టి, తాత్కాలిక రాజధాని పేరుతో సీమ జనాలను ప్రస్తుతానికి మభ్యపెడితే చాలు అన్నది ఆలోచన. ఇది గ్రహించక బళ్లారి, తుంగభద్ర నీళ్లు పోగొట్టుకున్నాం.

ఇది జరిగిన దాదాపు 50 సంవత్సరాల తరువాత, తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉంది. ఇక తెలంగాణ ఏర్పాటు అనివార్యం అని తెలిసినా సీమ జనాలు చరిత్ర నుండి పాఠాలు నేర్వలేదు. తమ ప్రయోజనాల కోసం పోరాడలేదు. సమైఖ్యఆంధ్ర మత్తులో జోగున్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని లేదా అటువంటి రాయలసీమకు ప్రత్యేక ప్రతిపత్తి, ప్రయోజనాలు కల్పించే విధంగా ప్రకరణలను రాజ్యాంగంలో పొందుపరచాలని ఉద్యమించలేదు. కృష్ణా జలాల్లో నిర్ధిష్ట వాటా తేల్చండి అని అడగలేదు.మరోసారి ఉత్తరాది వారి పెత్తనం తప్పదని గ్రహించలేదు.

సీమాంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అధికార వికేంద్రీకరణ స్థానంలో కోస్తా కు 32000 వేల ఎకరాల రాజధాని వచ్చింది.ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన ఆ శ్రీబాగ్ ఒప్పందానికి దాని మీద సంతకం చేసిన పెద్దమనుషుల మీద గౌరవంతో అన్నా హైకోర్టు ఏర్పాటు సీమలో చేయండి అంటే, జిల్లాకొక హైకోర్టు పెడతారా అని హేళన మాటలు.

ఫలితం

రాజధాని, హైకోర్టు, నీళ్లు, నియామకాలు, నిధులు అక్కడ

అప్పులు, అవమానాలు, ఆత్మహత్యలు, వలసలు, కరువు, నిరుద్యోగం ఇక్కడ

ఇది ఎవరి తప్పు? చరిత్ర నుండి పాఠాలు నేర్వకుండా మళ్లీ మళ్లీ మన ప్రయోజనాలు తాకట్టు పెడుతూ మోసపోతున్న మనదే..

ఇప్పటికైనా మేల్కొంకపోతే ఇంకో 300 ఏళ్లయినా ఇదే పునరావృతం అవుతుంది. అప్పటికీ ఇప్పటికీ సీమ విద్రోహ దినం ఏదైనా ఉంది అంటే అది శ్రీ బాగ్ ఒప్పందం సంతకం చేసిన రోజే.. ఆ విధ్రోహకాన్ని కొనసాగింపుగా రాయలసీమకు ఏది ఇవ్వాలన్నా అడుగడుగునా అడ్డుపడుతున్న తూర్పునాటి మేధావులు! ఇక ఛావో రేవో మనం వేర్పాటవాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లడం కాదు రాయలసీమ రాష్ట్రం సాధించే వరకూ కాడి దించకూడదు!

#జై_రాయలసీమ
#Rayalaseema

By: Ravitheja

13 

Share


Ram Rj
Written by
Ram Rj

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad