ఓక మూడు సంవత్సరాల క్రితం బస్టాపుల్లో తెలిసిన అమ్మాయి ముఖం అని అనుమానం దగ్గరకు వెళ్ళి పలకరింపు చేయాలా వద్దా అని తటపటాయింపు ఇంతలో తనే వచ్చి నా ఎదురుగా నిల్చోని ఏలా ఉన్నావు అని పలకరింపు నాలోని ఆనందం ఆశ్చర్యం ఓకే సారి చిరనవ్వుతో సమాధానం ఇచ్చాయి.
తను నా స్కూల్ మేట్ నా కాలేజ్ వెళ్ళే దారిలోనే వారీ కాలేజ్ అంతా క్షణాల్లో ప్రశ్నలకు సమాధానాలు వచ్చేసాయి రోజు వారి ప్రయాణాలలో ఉదయం కాలేజ్ సమయం గంధరగోలం కానీ ఈ ప్రయాణాలలో తన చూపుల మిరమిట్లు నాకు తెలిసిన ప్రతి సారి ఏదో భావన ప్రతి విషయం పంచుకోవాలీ అనే తపన నుంచి నా పక్కన తను ఉంటే పంచభూతాలు నా పక్కనే ఉన్నాయి అనే అద్బుతమైన ఆలోచన వరకు.
పరిచయం ప్రేమగ మారటానికి నాకు సమయం ఏక్కువగా అవకాశం ఇవ్వలేదు కానీ నా మనసుమాటలను తనకు చెప్పటానికి పెదాల మౌనం మాత్రం ఆలాగే ఉండిపోయింది. శుభోదయం నుంచి శుభరాత్రి అనే వరకు తన పరిభాషనలే.
ఎన్ని సార్లు ఏదురోడిన నచ్చిన చెలి దగ్గర నుంచి వచ్చే చిరునవ్వు చిరునామా ప్రేమ అయితే నాలోని నాట్యకారుడీ హృదయపు స్పందన నాకే వినిపించేది.తను చేసే ప్రతి విషయం గురించి నాకు సమాచారం చేరవేస్తూనే ఉండేది తను రాసిన పరీక్షల నుంచి నా నీరిక్షణ వరకు అన్ని ఓపికగా వినేవానీ.
ధైర్యం చేసే చెప్పే దమ్ము లేదు, ప్రతి రోజు మాట్లాడకపోతే ఏదో వెలతిగా ఉండేది కానీ నా ప్రవర్తన చెప్పే నా ప్రేమ నిజం తనకు అర్థం అయ్యిందో, గలగలా వచ్చేటి మాటలు చినుకుల కురిసి కురవక వచ్చేవి, తీపి అయినా చేదు అయినా రుచించినంతవరకే నా అతి శ్రధ్ధ తనకు నచ్చలేదో అనుకుంట నా ప్రేమ కథకు నేను చేసిన చిన్న పొరపాటు జీవితంలో నాకు తను ధూరం అయ్యేలా చేసింది ఓక సంవత్సరం వరకు ఊహలే జ్ఞాపకాలై ఏ మెసేజ్ వచ్చిన తనే అనే భావన కలుగుతుండేది. ఎక్కడ నీ పేరు విన్న ప్రతి సారి కన్నీటి చుక్కలు జాలువారేవి కానీ నీ 'జాడ' మాత్రం తెలుసుకోలేక పోయా.
ఊసులు చెప్పలేనీ నా భావలను తను అర్థం చేసుకుందో లేక నా మౌనాన్ని జీవితకాలం భరించలేను అనుకుందో నా ప్రేమ జ్ఞాపకాలను మాత్రం నాలో నాకే తీపిగా వదిలేసి తను ఉషసులను నా చూపులకు శాశ్వత విరామం ప్రకటింపచేసింది. వర్షం ముందు మబ్బుల చాటున దాగివున్న సూర్యునిలా తన ప్రేమకై వేచిఉన్నా.
ఏ సెలవులు వచ్చిన వారి ఊరిలో నా కాలు మోపేలా చేసేది నా చూపుల వెతుకులాట తనకు ముందే తెలిసేదెమో ఎక్కడ కనబడక పోయేది ఓక సారి చూసా వారి ఊరి దేవుడి గుడిలో నా దేవతను అంతే జీవితపు ప్రయాణంలో ఓక మజిలీ నా ప్రేమ ప్రయాణం.