Bluepadకనిపిస్తావు కదూ..!!
Bluepad

కనిపిస్తావు కదూ..!!

ఆనిరాజ్ కూచిపూడి
ఆనిరాజ్ కూచిపూడి
29th Nov, 2021

Share

కనిపిస్తావు కదూ...!!💝
~~~~~~~~~~~~~~~~

గుండె గుబులు సంద్రమై
అశ్రు హోరు ఆగడం లేదు.!
హృది నిండిన రాగాలెన్నో
శృతి లేని కృతులు ఆలపిస్తున్నాయి.!!

ప్రభాతాన శ్వేతవర్ణ కాంతిలా నువ్వొస్తావని
మంచు తెమ్మరలు నమ్మిస్తున్నాయి.!
నిశీధిలో చంద్రికలా తనువు తడతావని
శీతల సమీరం ఇచ్ఛను సజీవం చేస్తున్నాయి..!!

నీ చిరునవ్వుకై వెదికి నీరింకిన
కనురెప్పలు నెర్రెలిచ్చి కుమిలిపోతున్నాయి.!
అలకబూనిన కరిమబ్బులా గుంభనంగా
చూడకుండా చిరుజల్లులా అయినా కనిపించవేం..!?

అవును కదూ..!
అనంతంలో ఆవిరయ్యావు కదూ..!!

కఠినమైన ఈ నిజాన్ని నా మది చూపులు
త్రోసి వేస్తున్నాయి..!
నీ జాడకై పంచభూతాలను
జల్లెడ పడుతున్నాయి..!

సమూహంలో ఒంటరినై
నీ మధుర స్మృతులను కలవరిస్తూ
ఎదురు చూస్తున్నా..!
కనిపిస్తావు కదూ..!!

మూగబోయిన మేను నాదంలో
స్వరాలు పలికించగ దరహాస రాగమై
వస్తావు కదూ..!

చీకటి క్రమ్మిన హృదయంలో
వెలుగులు వికసించగ చూపుల
మెరుపులా కనిపిస్తావు కదూ..!
కనిపిస్తావు కదూ..!!

- ఆనిరాజ్ కూచిపూడి
సత్తెనపల్లి

28 

Share


ఆనిరాజ్ కూచిపూడి
Written by
ఆనిరాజ్ కూచిపూడి

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad