Bluepadఫేర్ అండ్ లవ్లీ పేరు మారిపోతుంది
Bluepad

ఫేర్ అండ్ లవ్లీ పేరు మారిపోతుంది

S
Shankar
5th Jul, 2020

Share

ఇంకా పేరు అయితే ఫిక్స్ అవ్వలేదు అన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు పేరు మారిపోతోంది. కానీ తప్పక పేరు మార్చనుంది అయితే ఫెయిర్ అండ్ లవ్లీ గురించి చాలా మందికి తెలిసిందే ప్రతి రోజూ చాలా మంది దీన్ని ఉపయోగిస్తుంటారు దీనికోసం ప్రత్యేకంగా మనం ఏమీ చెప్పక్కర్లేదు దీన్ని వాడటం వల్ల చాలా ఫెయిర్గా వస్తుందని చాలా మంది అంటూ ఉంటారు. అయితే నిజమేమిటంటే తెల్లగా ఏమీ అవ్వరని అంటున్నారు చాలా మంది. అయినా కూడా వాడడం బాగా అలవాటైపోయింది జనాలకి.




అయితే ఈ కంపెనీ పేరు ఎందుకు మారుస్తుంది...? అయితే ఈ బ్రాండ్ పేరు ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కంపెనీ యోచిస్తోంది. అందుకే ఫేర్ అండ్ లవ్లీ ఫెయిర్ పదాన్ని ఉపయోగించ కూడదని నిర్ణయించుకుంది. త్వరలో ఆ పేరుని ఈ కంపెనీ ప్రకటిస్తుంది అని చెప్పింది కదా ఇప్పుడు మారుస్తోంది. రెగ్యులేటరీ ఆమోదం లభించిన తర్వాత కంపెనీ కొత్త పేరుని ప్రకటిస్తామని చెప్పింది ఈ పేరు చాలా పాపులర్ కానీ ఎందుకు వస్తుంది దీనికి గల కారణం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా ...? మరి ఆలస్యం చేయకుండా పూర్తిగా చదవండి

అన్ని రకాల స్కిన్ టోన్స్ ను సెలబ్రేట్ చేస్తామని హెచ్ ఎల్ కంపెనీ తెలిపింది అంటే కంపెనీ ప్రచార చిత్రాల్లో కేవలం తెల్లగా ఉన్న వారు మాత్రమే కాకుండా ఇక పై అన్ని రకాల రంగుల్లోనూ వారు కనిపిస్తారు అమెరికా హెల్త్ కేర్ అండ్ ఎఫ్ఎంసిజి దిగ్గజ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ గత వారం లో స్కిన్ వైటినింగ్ క్రీమ్స్ అమ్మకాలు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది అయితే బ్లాక్ లైవ్ మేటర్ నిరసన కారణంగా జాన్సన్ జాన్సన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది దీనితో అమెరికాలో స్కిన్ వైటనింగ్ ప్రొడక్ట్స్ అమ్మకాలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది.

ఇప్పుడు భారత్లోనే స్కిన్ వైట్నింగ్ బ్రాండ్లకు కూడా ఈ సగం తగ్గినట్లు కనిపిస్తోంది. అయితే ఇందు మూలం గానే హెచ్యూఎల్ కూడా ఈ పేరు లో మార్పు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుందట. అయితే 1975వ సంవత్సరం లో కంపెనీ ఫేర్ అండ్ లవ్లీ బ్రాండ్ మార్కెట్లోకి తెచ్చింది అప్పటి నుంచి ఈ పేరు తోనే కొనసాగుతోంది. ఇప్పటికి 45 ఏళ్ళు అయ్యింది.

అయితే ఇప్పటికే చాలా రోజుల నుంచి ఈ వాదనలు జరుగుతూనే ఉన్నాయి అలానే ఇది నిజంగా తెల్లగా ఉన్న వాళ్ళని బాధ పెట్టకుండా కేవలం రంగు తక్కువగా ఉన్న వాళ్ళని బాధిస్తోంది ఫెయిర్ పదాన్ని చాలా మంది తట్టుకో లేక పోతున్నారు ఇది కూడా ఒక కారణం అయితే అనేక కారణాల వల్ల ఈ ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్ అన్న పదాన్ని తీసి వేయనుంది కంపెనీ.

అయితే భారత దేశం విజయాన్ని అందుకుంది అనే చెప్పాలి. మరి ఫెయిర్ అన్న పదం తీసి ఈ స్థానం లో గ్లో పేరు ని పెట్టబోతున్నారు. ఫెయిర్ అన్న స్థానం లో గ్లో ని వాళ్ళు పెట్టనున్నారు.

0 

Share


S
Written by
Shankar

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad