Bluepad59 చైనా పై నిషేధం
Bluepad

59 చైనా పై నిషేధం

G
Gayathri
4th Jul, 2020

Share

దీని వల్ల మనం చైనా యాప్స్ ని మన ఫోన్ లో నుంచి తొలగించవచ్చు అయితే లడక్ సరిహద్దు ల్లోని కాల్వన్ లోయ ఘర్షణలో 20 మంది జవాన్లు అమరులైన తర్వాత మన భారతదేశం లో చైనాకు వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. అయితే అప్పటి నుంచి చైనా యాప్స్ ని బహిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్ కనిపించింది. ఈ విషయం పై కేంద్ర ప్రభుత్వం సోమవారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. అయితే చైనా కు సంబంధించిన యాప్స్ ని నిషేధించడం కొనసాగుతోంది. వాటిలో టిక్ టాక్ షేర్ఇట్ యూసీ బ్రౌజర్ సహా పలు యాప్స్ కూడా ఉన్నాయి. వీటి పై నిషేధాన్ని విధిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది పూర్తి వివరాల్లోకి వెళ్లాలంటే ఆర్టికల్ పూర్తిగా చదవండి




స్మార్ట్ ఫోన్ల రాక తో ప్రపంచమంతా అర చేతి లోనే ఉంది దీనితో వార్తలు అప్డేట్స్ ఫోటోలు వివిధ రకాలు కూడా మనకి సులువుగా ఫోన్లో కనిపిస్తున్నాయి. అయితే ఇంటర్నెట్ లో ఎప్పటికప్పుడు వెతుక్కునే వివరాలు తెలుసుకుంటున్నారు. దీంతో మొబైల్ అంత యాప్ లతో నిండి పోయింది అదే టిక్ టాక్ వంటి యాప్స్ తీసేయడం నిజంగా యూజర్స్ ని బాధిస్తున్న అర్థమవుతోంది.

అయితే టిక్ టాక్ బదులుగా చింగారి యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు చింగారి యాప్ లో షార్ట్ వీడియోలు చేయొచ్చు ఆ వీడియోలు షేర్ చేసుకోవచ్చు కానీ టిక్ టాక్ లో యూజర్నేమ్ మాత్రం అక్కడ ఉండదు. కానీ చింగారి యాప్ మన భారతదేశ యాప్ ఈ చింగారి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని టిక్ టాక్ లాగ వీడియోలు చెయ్యడానికి వాడుకోవచ్చు దీని ఫీచర్స్ కూడా బాగున్నాయి ఇప్పటికే చాలా మంది చింగారి యాప్ ని డౌన్లోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

టిక్ టాక్ రేటింగ్ కూడా పడి పోయింది. ప్లే స్టోర్ లో చింగారి ఆప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆపిల్ ప్లే స్టోర్ లో కూడా దీన్ని ఉచితంగా పొందవచ్చు అలానే ఫోటోలకు అదనపు హంగులు అద్దడం అందంగా మెరుగుపరచడం కోసం ఎక్కువగా యుకేం బ్యూటీ, బ్యూటీ ప్లస్ యాప్ ను వాడుతున్నారు. అడోబ్ ఫోటోషాప్ లైట్ రూమ్ గూగుల్ స్నాప్ సి డి యాప్ ను ఉపయోగించవచ్చు అలానే వీడియోలను సులభంగా వేగంగా ఎడిట్ చెయ్యడానికి ఆడియోని జోడించడానికి యు కట్ వైవా వీడియో వైర్ కట్ ఫిలిం మోర లాంటి ఆప్స్ను నేటి యువత ఎక్కువగా వాడుతోంది. వీటికి బదులుగా కైండ్ మాస్టర్ అడోబ్ ప్రీమియర్ క్లిప్ మ్యాజిక్ షో ఆప్ ని వినియోగించవచ్చు

టైపింగ్ కోసం కొంతమంది మొబైల్ లో ఉండే డిఫాల్ట్ కీబోర్డ్ తో పాటు అదనపు కీబోర్డు ఇన్స్టాల్ చేసుకుంటారు. మైక్రోసాఫ్ట్ షిఫ్ట్ కీబోర్డ్ వాడవచ్చు అలానే ఇతర భాషలోని పదాలకు అర్థాలు తెలుసుకోవడం కోసం చాలా మంది యు డిక్షనరీ యాప్ ను వాడుతున్నారు దీనికి బదులు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ గూగుల్ ట్రాన్స్లేట్ వంటి యాప్స్ ని కూడా వాడుకోవచ్చు. వీటి కోసం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఓన్లీ ఆఫీస్ లాంటివి కూడా ఉన్నట్టు అందరికీ తెలిసిందే.

0 

Share


G
Written by
Gayathri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad