ఈ దేవాలయంలో శిల్పాలు ఎంతో అందంగా ఉంటాయి కూర్మనాథ స్వామి ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయి. పదకొండవ శతాబ్దానికి చెందిన కొన్ని శాసనాలు ఇక్కడే ఉన్నాయి ఈ ఆలయాన్ని చోళులు కళింగ లు అభివృద్ధి చేశారు. అన్ని ఆలయాల తో పోల్చితే ఈ ఆలయం విభిన్నమైనది ఎందుకంటే ప్రతి ఆలయంలోనూ గర్భగుడిలో దేవుని విగ్రహం ఉంటే ఈ దేవాలయంలో మాత్రమే గర్భగుడిలో ఎడమ వైపు గోడ మూలగా కూర్మనాథుని అవతారం లో ఉన్న విష్ణువు కొలువై ఉంటారు.
కూర్మనాథ స్వామి రెండున్నర అడుగుల పొడవు అడుగు ఎత్తులో ఉంటుంది మరియు మొదట తల మధ్య నో శరీరం చివరిగా పశ్చిమాభిముఖంగా తోకతో ఇలా మూడు భాగాలుగా శ్రీకూర్మం కనిపిస్తుంది చివర ఉండే తోక, తాటి పండు పరిమాణంలో ఉండి వేరే శిలగా ఉంటుంది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం గర్భగుడి లోకి భక్తులను అనుమతించరు కాకపోతే ఈ దేవాలయంలో భక్తుల అందరిని గర్భగుడిలోకి అనుమతించటం జరుగుతుంది దాంతో భక్తులు నేరుగా గర్భ గుడిలోకి వెళ్తే అడుగు ఎత్తు 5 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పు కొలతలతో పీఠంపై స్వామిని దర్శించవచ్చు.
దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు మందరపర్వతం ఒక పక్కకు పొంగి పోతుంటే దానినే నిలబెట్టడానికి విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తాడు ఇదంతా లోక కళ్యాణం కోసమే అని మందగిరి బాధ్యతలను స్వీకరించారు దాంతో లోక శ్రేయోదాయకం దర్శిగా వెలిశారు. కూర్మావతారమే కాకుండా శ్రీమన్నారాయణుడు విష్ణు పద్మ బ్రహ్మాండ పురాణాల్లో ఈ ఆలయం యొక్క ప్రస్తావన కనపడుతుంది. నిజానికి శ్రీకూర్మం లో తప్ప ఇంకెక్కడ కూర్మావతారం లో స్వామి కనిపించలేదు దీనికి కూడా ఒక పురాణం ఉంది ద్వాపరయుగంలో శ్రీకాకుళం లో ఉన్న ఉమారుద్ర కోటేశ్వర లింగా ప్రతిష్ట చేయడానికి బలరాముడు శ్రీకూర్మం వచ్చాడు. ఆ సమయంలో ఆ క్షేత్రపాలకుడైన భైరవుడు అడ్డుకోగా బలరాముడు భైరవుని గిరగిరా తిప్పి విసిరేశాడు ఈ విషయం తెలిసిన కూర్మనాథస్వామి బలరాముడికి దర్శనభాగ్యం ఇచ్చాడు అయినా సరే అవమానంతో మరియు ఆగ్రహంలో కూర్మ అవతారం శ్రీకూర్మం లో తప్ప ఇంకెక్కడ ఉండకూడదని స్థాపించాడు దాంతో ప్రపంచంలోనే ఇది ఏకైక కూర్మనాథ స్వామి వారి క్షేత్రంగా నిలిచింది.
ఈ ఆలయానికి సమీపంలో నరసింహ తీర్థ ఉంది తిలోత్తమ వాళ్ళ నరసింహుడు అక్కడ వెలిసాడు మరియు ఆయన్ను పాతాళ నరసింహుడు అని పిలుస్తారు ఈ క్షేత్రానికి వంశధార నదీ తీరంలో శ్రీ కూర్మ శైలం అనే పర్వతం కూడా ఉంది ఇదంతా స్వామి వారి విరాట్ రూపమని నమ్మకము
ఈ ఆలయాన్ని చేరుకోవడానికి శ్రీకాకుళం పట్టణం పాత బస్టాండ్ దగ్గర కు ప రాశి పదిహేను నిమిషాలకు అరసవిల్లి మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులు అందుబాటు లో ఉంటాయి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఎన్ని గంటల వరకు నడుస్తాయి బస్సులతో పాటు ఆటోలు టాక్సీలు కూడా అందుబాటులోనే ఉంటాయి.