Bluepadచినుకు
Bluepad

చినుకు

R
Reshma us
2nd Jul, 2020

Share






చిన్న చినుకులు ముత్యాలై
కురుస్తూ ఉంటే...
అందమైన ఆకాశం
చూస్తుంటే
మనసు ఆనందపడుతుంటే
ఆ క్షణం బాధలన్నీ తొలగి
ఆ క్షణం జ్ఞాపకాలన్నీ తిరిగి..

అందమైన ప్రకృతిని
అలా చూస్తుంటే
చల్లగాలికి ఎద
అలా నవ్వుతుంటే
ఇదేగా ఆనందం
ఇదేగా ఆహ్లాదం..

అలా ఆ వాన
ఓ రాయి మీద
ముత్యం అవుతుంటే
ఆ చప్పుడు
సంగీతమై
సంతోషాలని అందిస్తుంటే..

కిలకిలా రావాలతో
కోకిల రాగాలతో
కమ్మని మట్టి సువాసనతో
అబ్బా వాన తో
అరెరే వానలో...

9 

Share


R
Written by
Reshma us

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad