Bluepadజ్ఞాపకం
Bluepad

జ్ఞాపకం

S
Surya_Kolluri
1st Jul, 2020

Share

జీవిత నాటక చివరన
కథ ముగిసే సమయాన
నేను ఒంటరిని అయి
ఆలోచనల బందీ అయి
గడిచిన కాలం కాలి అయి
పరుగెత్తిన పైకం మాయమై
అన్వేషణ మొదలైంది నాలో
ఏదో తెలియని అలజడితో
ఏమి చేశా అణు తలపుతో
లెక్కించా నా లెక్కను తక్షణం
అంతుచిక్కని మాయలో పడిన
అరవై యేళ్ళ నా వయసును
పదిహేను ప్రాయంలో
ఒంటి కాలు మార్కులకు పరుగెత్తా
పేపర్ లో మొదట ఉండే పెద్ద బొమ్మ
నా బుర్రలో ప్రపంచ కప్పు ఆ కాలాన
కానీ ఈ క్షణం నా ఒంటరితనముని
అ బూజు పట్టిన పత్రము
ఏ మూలనో ఉన్న బహుమానాలు
తీర్చలేదు నాకు ఏ సమస్యను
ఇవ్వలే నాకు ఏ సమాధానాన్ని
తోడు రాలే నా ఈ ఏకాంతమున
మొత్తానికి దాటేసా ఆ పరీక్షలను
మొదలైనవి అసలు పరీక్షలు
వందలలో స్నేహితులు
పదులలో నా అనువారు
అందరిలో నేనో చిత్రం
ఆనందాన్ని అర్దంతెలిపే
విభిన్న సమాన పక్షులమై
మా అందరి గూడైన కళాశాలన
స్నేహాలు, అభిమానాలు, అప్యాయతలు
చివరిదాకా ఉంటాయనిపిచ్చే మాయ
పరిచయమైన సమయం కూడా గడిచె
సాధించింది మాత్రం శూన్యం
ఈ చివరన లేరు చెంత
కానీ లేరని నాకూలే చింత
ఇంకొన్ని అడుగులకి
జ్ఞానభోద అయ్యిందని
సమాజంలో లోపం కొత్తగా
సరికొత్త గా కళ్ళులో పడి
మార్చాలని మనసు తలచి
కదిలించా నాకు తోచిన దిశలో
అది మారాలి ఇది మారాలని
అరిచి చివర ఆఖరున ఏది
మారదని తలచి మనసు విరచి
వదిలేసా ఉద్యమ కథలను
అది మాత్రం ఏమి ఇచ్చింది
మంచోడు అను అణునామము తప్ప
ఏ మాత్రం కానరాలే
నేను తోచిన లోకం
నీవు లేక నేను లేను అను
సంసారం సౌఖ్యం
నీవు ఎవరు నేను ఎవరు
అంతా దైవ సమానులమను
దైవత్వ భక్తి మార్గము దాకా
కాలము మరి కనురెప్ప కాలం
అన్ని దాటి ఊహలు విడిచి
చేరెే నేను ఈ నిమిషం
మరలా మొదట్కొచ్చే ఆలోచన
ఏమి పొందా ఇన్నాళ్ళు
ఏమి ఉంది నా కొరకు
ఎవరు ఉన్నారు ఇప్పుడు
వెతికి వెతికి విసుగెత్తితే
దొరుకే నా చిరకాల మిత్రుడు
నా వాయు నేస్తం! గాలిమిత్రం
ఎవరి దగ్గరైన ఎవరి దూరమైన
గెలుపు అయినా ఒటమి ఐన
వెలుగు అయినా నిశిమాయైనా
నీడ అయినా ఎండ అయినా
ఏది ఏమైనా ఏమైయిపోయినా
జననం నుండి మరణం దాకా
తను నాతోనే నాలోనే
తను లేనిదే మరణం
తను చేర్తేనే జననం
కానీ ఇవ్వాలే తనకి ఆ గౌరవం
తను కోరలే ఏ సత్కారం



20 

Share


S
Written by
Surya_Kolluri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad