Bluepadఎడారి బతుకులు..!!
Bluepad

ఎడారి బతుకులు..!!

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
29th Jun, 2020

Share

ఎడారి బ్రతుకులు...!!

జీవితపు ఎడారిలో
మల్లెపూల సువాసనలు
అందడం లేదు
కనుచూపుమేరా
కళ్ళకు ఇసుకే కమ్ముకుంది..!!

ఇసుక తిన్నెలు తిట్టేసి కూర్చుంటే
పచ్చని వసంతం ఎక్కడ
విధి బలహీనమై నడుస్తుంటే
బ్రతుకంతా కూరుకు పోతుంటే
అగాధ లై కనిపిస్తుంటే....!!

ఆశల ఒయాసిస్ కానరావు
ఖర్జూర ఫలము కమ్మదనం కనిపించదు
ఎడారి ఓడ నడక ఆపింది
ఎముకల గూడు కట్టుకొని
అలసిన బ్రతుకులు సాగవని...!!

ఇసుక తుపానులో
ఎన్నో జీవితాలు అతలాకుతలం
తుపాను ఆగినాక
కప్పబడిన కళేబరాలు ఎన్నో
ఆకాశములో రాబందులు అన్ని...!!

ఎడారిలో వసంతాలు ఎప్పుడు
గడ్డి పూల సువాసనలు
గతాన్ని గుర్తు చేసుకుంటూ
వర్తమానాన్ని ఈడ్చుకుంటూ
భవిష్యత్తుకు చిగుళ్లు వేస్తాయా...!!

కొప్పుల ప్రసాద్
నంద్యాల

22 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad