Bluepadయువత సొంత ఇల్లు వంటివి కొనుగోలు చేయడానికి ఆసక్తి ఎందుకు చూపించడం లేదు..
Bluepad

యువత సొంత ఇల్లు వంటివి కొనుగోలు చేయడానికి ఆసక్తి ఎందుకు చూపించడం లేదు..

S
Sriharini
29th Jun, 2020

Share

గతం లో డబ్బులు ఉంటే వాటి తో పొలం కొనుక్కోవడం లేకపోతే ఏమైనా ఇల్లు స్థలం వంటి వాటిని కొనుగోలు చేసే వారు కానీ ఇప్పుడు అది తగ్గి పోయిందనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి కాలం లో యువత బాగా లగ్జరీ లైఫ్ కి బాగా అలవాటు పడిపోయారు. దీని వల్ల ఏమిటంటే వాళ్ళు బాగా ఉన్న విశాలంగా ఉన్న ఇల్లు చేయడానికి కూడా వెను కాడడం లేదు అందుకని వాళ్ళు కొంత స్థలాన్ని సొంత ఇల్లు ని కొనుక్కోకుండా వాళ్ళు కేవలం అద్దె ఇంట్లో కూడా లగ్జరీగా బతుకుతున్నారు. ఖరీదైన కార్లు రేట్ ఎక్కువైనా గ్యాడ్జెట్లు వాడడానికి మక్కువ చూపిస్తున్నారు కానీ స్థలం ఇల్లు లాంటి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు ఇది ఎంత వరకు నిజమనేది తెలియదు కానీ నా ఊహ ప్రకారం ఇదే చేస్తున్నారని అర్ధం అవుతోంది




అలానే కారు మార్చి మరో కారు తీసుకోవడం లాప్టాప్ ఫోన్స్ ఐప్యాడ్ ఐఫోన్ ఇలా వివిధ రకాల గ్యాడ్జెట్లు కొనుక్కోవడం వాటి తోనే జీవించడం జరుగుతోంది ఇది సాంకేతిక యుగం లా మారి పోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లైఫ్ కి బాగా అలవాటు పడి పోయారు దానితో కొంత వ్యవధి మాత్రమే కృత్రిమ జీవితాన్ని బతుకు ఉన్నట్టు ఉంది అంతే కానీ ఇల్లు కొనుక్కోవాలి స్థలాలు కొనుక్కోవాలి బంగారం కొనుక్కోవాలి ఇలాంటివి బాగా తగ్గిపోయాయి కేవలం ఆర్టిఫిషియల్ జీవితాన్ని బతుకుతున్నారు


ఎక్కువ ఖర్చు పెట్టి కార్ల మోజు లో పడి పోవడం చాలా మంది చేస్తున్నారు అలానే లక్షల్లో బండ్లు కొనుక్కోవడం సినిమాలు షికార్లు అంటూ డబ్బు తగలెయ్యడం ఇది బాగా చూస్తున్నదే గత కొన్నేళ్ల నుంచి ఇదే పరిస్థితి చూస్తున్నాం. అలానే ప్రతి ఒక్కరు డిజిటల్ లైఫ్ కి బాగా అలవాటు పడిపోయారు డిజిటల్ లైఫ్ లో పడిపోయా ఆర్టిఫిషియల్ బతుకుల మాత్రమే వాళ్లు బతుకుతున్నారు

నిజంగా ఇది వరమనే చెప్పాలి ఇదిలా ఉంటే వీళ్ళు మాత్రం హుందాగా బతకడానికి ఇష్ట పడుతున్నారు. దానితో వాళ్ళు సంపాదించేది ఎంతైనా సరే ఖర్చు పెట్టేస్తున్నారు డబ్బు వచ్చిందంటే మంచి నీళ్లలా ఖర్చు అయి పోతున్నాయి కార్లు బైకులు షికార్లు సినిమాలు సరదాల కి ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వడం వల్ల ఇవి కొనుక్కోవాలి ఇవి నేర్చుకోవాలి అని వాళ్ళ లో ఆలోచన రావడం లేదు.

ఈ వే ఆఫ్ లివింగ్ ఎంత మాత్రము కరెక్ట్ కాదు ఎందుకంటే ఇవేమీ శాశ్వతం కాదు ఒక ఫోన్ ఐదారేళ్లు వాడుకుంటే జాగ్రత్తగా తర్వాత ఖచ్చితంగా పోవచ్చు. ఫోన్ అనేది పోతుంది అలానే ఒక పది పదిహేను ఏళ్ళ తరువాత కార్ పోవచ్చు కాబట్టి ఏమి స్థిరం కాదు కనుక ఇల్లు అమర్చు కోవడం స్థలాలు కొనుక్కోవడం లేక పోతే నచ్చిన బిల్డింగ్ లాంటివి కట్టుకోవడం ఉత్తమం కనుక యువత వీటి పై దృష్టి పెడితే మంచిది

0 

Share


S
Written by
Sriharini

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad