Bluepadఎన్నాళ్లు...
Bluepad

ఎన్నాళ్లు...

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
29th Jun, 2020

Share

*ఎన్నాళ్ళు...!!*

నిశ్శబ్దంగా జీవితం సాగిపోతుంది
బతుకంతా మౌనంగా వెళ్లిపోతుంది
మనోవేదనతో నరకం కనిపిస్తుంది..!!

ముఖంలో దీనత్వము తాండవిస్తుంది
పెదవి పై చిరునవ్వులు కనబడడం లేదు
కుంగిన హృదయానికి స్పందన లేదు..!!

మాటలకు భావం అందడం లేదు
శ్వాసకు గాలి సహకరించదు
కళ్ళు కన్నీళ్లు తోడి పోస్తున్నాయి...!!

మౌనం నోరు విప్పలేదు
చీకటిలోకి విసిరేస్తుంది జ్ఞాపకం
అగాధం కనిపిస్తుంది క్షణక్షణం...!!

చెలరేగుతున్న మనసులో దావాగ్ని
చివరికి మిగిలిపోయిన కాఠిన్యం
ఎన్నాళ్ళు నటించాలి అయిష్టత..!!

*కొప్పుల ప్రసాద్*
*నంద్యాల*

11 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad