Bluepadఅసిధారావ్రతం
Bluepad

అసిధారావ్రతం

బంధకవి రామారావు
28th Jun, 2020

Share

తెలుగుభాషా, అనే అతి సుందర, అద్భుత నందన వనాన, నాకు నచ్చిన అందమైన, అతికోమల అక్షర కుసుమాలను కోసుకొచ్చి, ప్రాసలనే దొరికిన దారంతో, చిన్న కవితా మాలను, మాలగా గుచ్చి కవితా సుందరికి కానుకిద్దామని, చూడబోవ అచట కవితా సుందరికి మహాకవులు, కవివరులు అమృత హస్తాలతో, స్వచ్చందోబద్ధమైన, యతి ప్రాసలు తో అల్లిన, ఉత్పల మాలలు, చంపకమాలలు, కంద, సీస, మత్తేభ నామ బంతులతో, చేమంతులతో, అల్లిన గజ దిగ్గజ మాలలు, పద్య సుమాలుతో , గ్రంథ పు సాంబ్రాణి ధూపాలతో, దేదీప్యమైన కవితల దివ్వెలు, వెలిగించి మనోహరంగా, సాగించిన సాహితీ సుమ ఆర్చనం చూసి, నే తలచా, కవనమంటే ఒక అసిధారా వ్రతమని, పరమార్ధత తో నిండిన పరికర్మమని ! పవిత్రమైన వ్యాసంగమని ! భగవత్ప్రసాద మహత్భాగ్యమని !

13 

Share


Written by
బంధకవి రామారావు

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad