Bluepadనాన్న
Bluepad

నాన్న

సావిత్రి రవి దేశాయ్
సావిత్రి రవి దేశాయ్
27th Jun, 2020

Share

స్పందించే హృదయాలు గ్రూపులో నిర్వహించిన కవితల పోటీలో ద్వితీయ స్థానం ...

@@నాన్న@@

తొలి గురువు అమ్మ అయితే, మలిబడికి తొలిమెట్టు 'నాన్న'...!!
అమ్మ ప్రపంచానికి మనల్ని చూపిస్తే, ప్రపంచాన్ని మనకు చూపే దివ్య దృష్టి 'నాన్న'... !!
మన ఆడంబరాల కోసం, తన అవసరాలను త్యాగం చేసేది 'నాన్న'....!!
కూతురు అచ్చట్లు, ముచ్చట్లు చూడటం కోసం కోసం, జీవితపు శ్రమను చూసేది 'నాన్న'...!!
కరుకు మేఘంలా గర్జించి, ఉరిమి చూస్తాడే కానీ, తొలకరిజల్లు లాంటి ప్రేమను కురిపించక, మదిలో దాచుకుంటాడు 'నాన్న'....,!!
తను రాళ్ళ బాటలో నడిచినా, పిల్లలకి పూలబాటై నిలుస్తాడు 'నాన్న'...!!
అహర్నిశలూ పిల్లల శ్రేయస్సుకై, తన జీవితాన్ని అర్పిస్తాడు 'నాన్న'...!!
నాన్నంటే నిస్వార్ధానికి, మారుపేరని నేను నమ్ముతాను...!!

5 

Share


సావిత్రి రవి దేశాయ్
Written by
సావిత్రి రవి దేశాయ్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad