Bluepadమేఘమా కరుణించవే..
Bluepad

మేఘమా కరుణించవే..

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
27th Jun, 2020

Share



శీర్షిక:మేఘమా కరుణించవే

పల్లవి:
మేఘమా కరుణించే
మా హృదయాలు పులకించేలా
రైతన్నను నడిపించే
ఫలసాయం అందించేలా

చరణం:
1.పుడమి తల్లి పురుడు పోసుకొన్నేదుకు
మొడు వారిన ఆశలు చిగురించే టందుకు
మొలకలతో స్వాగతం అందించేందుకు
నెర్రెలు బారిన నేలకు ప్రాణం పోసేందుకు

!! మేఘమా కరుణించే!!

2.ఆకాశం మేఘాలు కమ్ముకుంది
నేల తల్లిని వర్షాధారతో బంధించి
మురిసిపోతూ మురిపించింది
హర్ష జలముతో అలరించింది

!!మేఘమా కరుణించే!!

3.భానుడి ప్రతాపాన్ని తగ్గించి
వేసవి కాలం వీడ్కోలుకు వచ్చి
రానున్న వర్ష ఋతువుకు స్వాగతం ఇచ్చి
పచ్చని పంటలకు జీవం తెచ్చింది

!!మేఘమా కరుణించే!!

4.రైతన్న నాగలికి భూదేవి యదపై
అందమైన ఆకృతులు దున్నుటకై
సేదతీరిన ఎద్దులు సేద్యానికి సిద్ధమై
ఏరువాక తో వ్యవసాయానికి రూపమై

!!మేఘమా కరుణించే!!

5.చిరు చల్లులతో బుర్ర బుర్ర భూమి పొంగి
మట్టి వాసన తో పరిమళాలన్ని కుంగే
ఆశీస్సులు అందిస్తున్న నింగి
ఆనందముతో అమృతము ఉప్పొంగే

!!మేఘమా కరుణించే!!

6.సెలయేళ్ల ను సవ్వడిలో నింపేందుకు
మృదంగ నాద ధ్వనులను వినిపించేందుకు
ప్రకృతి అంతా పరవశించేటందుకు
వర్షపాతమే కావాలి అందుకు

!!మేఘమా కరుణించే!!

*కొప్పుల ప్రసాద్*
*నంద్యాల*

18 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad