Bluepadమట్టి కుండ..!!
Bluepad

మట్టి కుండ..!!

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
26th Jun, 2020

Share

మట్టి కుండ..!!



నేలపై ఉన్న మట్టి
కుమ్మరి కాళ్లతో తొక్కి
చేతులో పునీతమై
అందమైన ఆకారంతో పురుడు పోసుకుంది

నాది కాలంలో పుట్టి
ఆదిమానవుని చక్రాలతో
ఆయువు పోసుకొని
మట్టిలో పుట్టిన మాణిక్యం అయింది

చరిత్రకు ఆలవాలము
యుగాలు సాక్ష్యంగా నిలిచింది
సంస్కృతికి సాధనంగా
పూర్ణకుంభ మై సాగింది

నీటి నిల్వకు బాన
త్రాగడానికి ముంతా
వండడానికి కుండా
మోయడానికి ముకటై తోడుగా నిలబడింది

చల్లని నీటితో నివాసమై
మలినాలను అడుగు చేర్చి
శుద్ధమైన నీరుకు ఆవాసమై
గొంతును తడిపి చల్లధనాన్ని ప్రసాదించింది

ధనం దాచిన పాత్ర అయింది
నేలలో దాచిన నిధి అయింది
దొరికిన వాడికి అక్షయపాత్ర
మట్టిలోనే దాగి నా కనక పాత్ర అయింది

పెళ్లిళ్లకు ప్రధాన పాత్ర పోషిస్తుంది
వాయిద్యంలో స్థానం సంపాదించింది
సప్తస్వరాలు పలికిస్తుంది
మట్టిలో పుట్టిన శబ్దం అయింది

పేదవాడికి భిక్షపాత్ర
ఉన్నవాడికి కనకపు పాత్ర
మధ్యతరగతికి వంట పాత్ర
అందరికీ ఉపయోగపడే మట్టి పాత్ర లై గెలిచింది

ఇంటిలో అందమైన ఆకృతులు
చిత్రకారుడి అపురూప శిల్పాలు
కళ్ళకు నింపిన ఆనందాలు
మట్టిలో తయారైన చిత్రం అయ్యింది

ప్లాస్టిక్ తో పతనమయ్యింది
ఆదరణ కరువయ్యింది
అద్భుత కల రూపాలు మరిచిపోయాం
మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసింది

*కొప్పుల ప్రసాద్*
*నంద్యాల*

8 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad