ఒక్కసారి నవ్వి చూడు, లోకమంత నీతో కలిసి నవ్వుతుంది... !!
ఇంకోసారి ఏడ్చి చూడు, ఎవరు స్పందించరు, ఒక్కరే పొగిలి పొగిలి ఏడవాలి...!!
ఎందుకంటే, ఎవరికీ కావలసినన్ని దుఃఖాలు వారికి ఉన్నాయి మరి ...!!
ఒకసారి గొంతెత్తి పాడిచూడు, కొండలన్ని ప్రతిధ్వనిస్తాయి...!!
అదే ఒకసారి నిట్టూర్పు విడిచి చూడు, గాలిలో కలిసిపోతుంది...!!
ప్రతిధ్వనికూడా, ఆనందాన్ని సంతోషంగా వినిపిస్తుంది... !!
అదే ఆలనాపాలనా చెప్పాలంటే, నోరు పెకలదు...!!
నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నీ చుట్టు ఉంటారు స్నేహితులు మెండు...!!
అదే దుఃఖిస్తూ ఉండు, ఒక్కడు రాడు ఓదార్చడానికి... !!
అందరి మీద రొక్కం వెదజల్లుతా అను, వద్దనేవాడుండడు...!!
అదే రొక్కం అవసరమై కన్నీళ్ళు పెట్టుకుంటుంటే ఒక్కడుండడు తోడు...!!
ఆనందోత్సాహాల మేళాలలో
బారులుతీరిమరీ మనుషులు నిల్చుంటారు...!!
బాధల గడప లోనుండి మాత్రం
ఒకరి వెంట ఒకరు నెమ్మదిగా జారుకుంటారు...!!
ఒక విందు చెయ్యి, మనుషులు కిక్కిరిసిపోతారు...!!
అదే నువ్వు ఆకలితో ఉపవాసం ఉంటే ప్రపంచంమంతా పక్కనుంచి తప్పుకు పోతుంది... !!
బాగుపడి, పంచుకో… ప్రపంచం నిన్ను బతకనిస్తుంది...!!
అదే చస్తున్నాను మొర్రో అను, ఏమాత్రం చేయూత అందించదు...!!
ఉషారు గా ఉండు… మనుషులందరు నీ స్నేహం కోరుకుంటారు...!!
ఉస్సురని ఉండు, ముఖం చాటేస్తారు...!!
అందరికీ నీ ఆనందంలో సమపాలు కావాలి...!!
కానీ ఎవ్వరికీ నీ కష్టంలో వాటా అక్కరలేదు... !!
తేది 21-06-2020