Bluepadగమ్యం...!!
Bluepad

గమ్యం...!!

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
25th Jun, 2020

Share

*గమ్యం..!!*

గమ్యం ఉంటేనే జీవితాంతం రసరమ్యం
ఆస్వాదించే వారికి అదే అమృతపానం..!!

ఎదుగుదలకు గమ్యమే నిజమైన స్వప్నం
జీవిత పరమార్ధ చెయడానికి సాకారం..!!

గమ్యం లేని మనిషి జీవితం నిస్సారం
తెలుసుకుంటే బ్రతుకంతా సారమే..!!

జీవన ప్రయాణంలో అలుపెరుగని గమ్యం
అటు పోటులకు బెదిరి పోనీ ధైర్యం..!!

నిస్సారం కలిగినప్పుడు సారవంతమైన మట్టిలా
ఫలప్రద మై నిన్ను ముందుకు తోసింది..!!

మహావృక్షమై నీకు దారి చూపుతుంది
ఎందరో జీవితాల్లో వెలుగు నింపింది...!!

గమ్యము లేని జీవితంగతము లేని మనిషి
ఎన్ని ఆలయాలు తిరిగిన లాభము లేదు..!!

సాగించు గమ్యం వైపు ప్రయాణం
పూల బాటలు కావు ధైర్యం బాటలు...!!

అడుగడుగున ముళ్ళ దారి తెలుసుకో
జ్ఞానముతో గమ్యం వైపు పెట్టు అడుగులు..!!

అలుపెరుగని శ్రమే గమ్యం
కృషిని నమ్ముకొని వేసే ప్రతి అడుగు గమ్యం..!!

గతం నుంచి భవిష్యత్తు సాగే ప్రతిక్షణం
నీవు సాధించిన విజయ పరంపర..!!

సాధనే లక్ష్యంగా గమ్యం వైపు అడుగులు
జీవితానికితిరుగు ఉండదు మనకంటూ..!!

గమ్యానికి పట్టుకుంటే ఎదురు ఉండదు నీకంటూ
చరిత్రలో ఉంటుంది ఒక పేజీ మనకంటూ ..!!

*కొప్పుల ప్రసాద్*
*నంద్యాల*


16 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad