Bluepadఅక్షరమే..ఆయుధ పోరాటం
Bluepad

అక్షరమే..ఆయుధ పోరాటం
*అక్షరాలే ఆయుధంగా పోరాటం(శీర్షిక)*

E
Emmadi Rambabu
25th Jun, 2020

Share

*అక్షరాలే ఆయుధంగా పోరాటం(శీర్షిక)*
అణగారిన ,ప్రజల సమస్యలపై అక్షరమే ఆయుధంగా స్పందిస్తూ
అభాగ్యుల ,ఆక్రందనలపై అక్షరాలు ఆయుధంగా
ఎక్కు పెడతాను.
పసికూనల భ్రూణ హత్యలపై
అక్షరమే ఆయుధంగా ఖండిస్తాను, రక్షిస్తాను
రైతన్నల బడుగు జీవుల బాగుకై అక్షరాల బలంతో
కలం హలంతో ..
బాసటగా నిలుస్తాను.
పిల్లల వృద్ధుల రక్షణకై
అక్షరాన్ని ఆయుధంగా చేసి
పెద్దలకు గుణపాఠం చెబుతాను
సమాజ పరి రక్షణ కై
అక్షరమే ఆయుధంగా
మలచి సంధిస్తాను.
వీర సైనికులు హతమార్చిన,
దుర్మదాంద్రుల అణచివేతకు..
కలాన్ని ఆయుధన్గా చేసి అక్షరాల తూటాలతో..
ఎదురొడ్డి నిలుస్తాను.
అమర వీర జవాన్ లకు అక్షర పుష్పాలతో నివాళులర్పిస్తున్న.
రచన: ఇమ్మడి రాంబాబు
తొర్రూరు,జిల్లా :మహబూబాబాద్,చరవాని:9866660631

12 

Share


E
Written by
Emmadi Rambabu

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad