Bluepadచిన్న పిల్లల చేత ఎటువంటి పుస్తకాలను చదివించాలి....?
Bluepad

చిన్న పిల్లల చేత ఎటువంటి పుస్తకాలను చదివించాలి....?

R
Reshma us
24th Jun, 2020

Share




అలానే విలువలు కూడా వాళ్ళకి బాగా తెలుస్తాయి మన సంస్కృతి సంప్రదాయం పట్ల గౌరవం కూడా వాళ్లు పెంచు కోవడానికి పుస్తకాలు మంచి స్నేహితులు. అయితే వాళ్ల చేత ఎటువంటి పుస్తకాలు చదివించాలి...? వాళ్ళ చేత రామాయణం మహాభారతం వంటి పెద్ద పెద్ద గ్రంధాలను చదివించక్కర్లేదు. అలానే వాళ్ళ చేత పెద్ద పెద్ద ఆంగ్ల పుస్తకాలు చదివించక్కర్లేదు. అయితే మరి వాళ్ళ తో ఏ పుస్తకం చదివించాలి... ? ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మరి ఆలస్యం చేయకండి ఈ ఆర్టికల్ ని చదివేయండి.

వేమన పద్యాలు :

చిన్న పిల్లలు వేమన పద్యాలు చెప్తుంటే ఎంతో ముద్దుగా ఉంటుంది వాళ్లు ఈ వేమన పద్యాలు నేర్చు కోవడం వల్ల వాళ్లలో మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. అంతే కాకుండా మంచి విలువలు మంచికి చెడుకి తేడా ఇటువంటి విషయాల పై వాళ్ళకి అవగాహన కలుగుతుంది కాబట్టి వీలైనంత వరకు పిల్లల చేత తల్లిదండ్రులు వేమన పద్యాలు సుమతి శతకం సుభాషిత రత్నాలు ఇటువంటి పద్యాలు చదివించడం వల్ల పిల్లల్లో మంచి లక్షణాలు కలుగుతాయి.

పెద్ద బాలశిక్ష :

పెద్దబాలశిక్ష లో ఎన్నో రకాల విషయాలు ఉంటాయి అయితే పదాలు నుంచి అక్షరాలు వరకు కథలు నుంచి పద్యాల వరకు ఇలా పెద్దబాల శిక్ష లో ఎన్నో ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా రోజుకు ఒక పేజి చొప్పున పెద్ద బాల శిక్ష లో ఉన్న విషయాలు పిల్లలకి నేర్పించడం వల్ల వాళ్ళు మంచి లక్షణాలని పెంపొందించుకుంటారు. దానితో పాటు వాళ్ళకి భాషతో పాటు పదాలు పద్యాలు వంటివి వస్తూ ఉంటాయి. దీని వల్ల వాళ్లకి భాష పై పట్టు తో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అలానే చక్కటి విలువలు కూడా వాళ్లు పెంపొందించుకో గలుగుతారు

శ్లోకాలు :

పిల్లలకి వివిధ రకాల శ్లోకాలని నేర్పించడం వల్ల వాళ్ళు కాస్త ఆధ్యాత్మికం వైపు మళ్లుతారు, సంస్కృతి సంప్రదాయాలు కి కూడా కట్టుబడి ఉంటారు అయితే ఎటువంటి శ్లోకాలు నేర్పించాలి అంటే భగవద్గీత లలితా సహస్ర నామం శ్లోకాలు నేర్పించడం మంచిది. దీని వల్ల జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది

ఇలా వాళ్ళకి నచ్చిన పద్యాలని శ్లోకాలని నేర్పించవచ్చు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక దానిని వాళ్ళకి నేర్పించడం వల్ల వాళ్ళు ఉత్సాహంగా కూడా తయారవుతారు. అంతే కాకుండా పదే పదే వాళ్ళ కి చెప్పించడం వల్ల కూడా చేదు తొలగిపోతుంది రేపటి భవిష్యత్తు వాళ్లు మెరుగ్గా తయారవడానికి ఇవి సహాయ పడతాయి అలానే ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన కూడా వాళ్లకి కలుగుతుంది.

ఇప్పుడు నేర్చుకున్నవి రేపటి పునాదుల ఉంటాయి కాబట్టి ఎంత ఎత్తు ఎదిగిన ఇప్పటి పునాది సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలి వాళ్ళకి వివిధ రకాల పుస్తకాలు చదివించడం చదివించడం వల్ల వాళ్ళకి చక్కటి పునాది మారుతాయి కాబట్టి ఇవి నేర్పించడం వల్ల వాళ్ల భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది.

1 

Share


R
Written by
Reshma us

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad