Bluepadఇంట్లో వస్తువులతోనే జిమ్
Bluepad

ఇంట్లో వస్తువులతోనే జిమ్

S
Sriharini
29th Nov, 2021

Share




ఇలా చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. దాంతో పాటు కరోనా నుంచి కూడా రక్షణ పొందవచ్చు కాబట్టి హోం వర్క్ ఔట్స్ మొదలు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఈ సమయం లో జిమ్లు తెరిచిన సరే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని అక్కడ వ్యాయామాలు చేయాలి ఇది చాలా ఇబ్బంది కరమైన విషయం. ఎక్కడ కరోనా సోకుతుందని భయం తో వ్యాయామాలు చేయాలి కాబట్టి పరిస్థితులు మామూలు అయ్యే వరకు ఇంట్లోనే వ్యాయామాలు చేయడం మేలు.

బకెట్ తో :

బకెట్ అనేది ప్రతి ఇంట్లోనే ఉంటుంది జిమ్ లో ఎన్నో బరువులెత్తే వ్యాయామాలు చేస్తాం కదా అదే ఫలితాన్ని ఈ బకెట్ తో పొందవచ్చు. ఈ వ్యాయామం చేయడానికి ముందుగా బకెట్ ని నీళ్ల తో నింపాలి దీంతో కండరాలు సాగేలా స్విచ్చింగ్ ఎక్సర్సైజులు చేయవచ్చు ఇలా చేస్తే కండరాలు బలంగా అవుతాయి. మీ రెండు చేతుల తో బకెట్లు పట్టుకొని కాళ్ళ మధ్య రెండు అడుగుల దూరం ఉండేలా నిలబడాలి. వెన్ను నిటారుగా ఉంచి మోకాళ్ళను 90 డిగ్రీల కోణం లో వంచుతూ కిందకు కుంగి కిందకు వంగి లేచి నిటారుగా నిలబడాలి. పైకి లేస్తున్నప్పుడు శరీరాన్ని విధించాలి ఇలా పదిహేను సెకండ్ల విరామం తో పదిసార్లు చేయటం మేలు. రోజుకు మూడు సెట్లు చేయడం ప్రయోజనకరం ఎలా చేస్తే శరీర సమతులనం సాధిస్తుంది.

టవల్ తో:

రెండు చేతుల తోటి టవల్ ని పట్టుకొని ఎన్నో రకాల వ్యాయామాలు చేయొచ్చు టవల్ రెండు చేతులను రెండు చేతుల తో పట్టుకుని చేతులు ఎదురుగా చాపాలి. ఇలా చేసినప్పుడు కాళ్ళ మధ్య రెండు అడుగుల దూరం నుంచి నిల్చోవాలి. ఒక కాలుని ముందు నుంచి మోకాళ్ళు వంచి ముందుకు వంగాలి. తర్వాత ఆ కాలిని వెనక్కి తీసుకు వచ్చి నిటారుగా నిల్చోవాలి ఈసారి రెండో కాలిని కూడా ఇలానే చేయాలి. ఇలా పది సార్లు మూడు సార్లు చేస్తే ప్రయోజనం ఉంటుంది.

ఈ వ్యాయామం చేయడం వల్ల తొడలు బలపడతాయి:

మాపింగ్ స్టిక్ తో మోకాళ్ళ మీద కూర్చుని ఒక చేత మాపింగ్ స్టిక్ పట్టు కోవాలి. అర చేతిని
నేల మీద ఆన్చి సాధ్యమైనంత ముందుకు నెట్టాలి. తిరిగి తన దగ్గరికి తీసుకొచ్చి రెండో చేత్తో కూడా ఇలానే చేయాలి. ఇలా రెండు చేతుల్లో మార్చి కదిలిస్తూ పది సార్లు చేయాలి ఈ వ్యాయామం కూడా మూడు సార్లు చేయాలి ఈ వ్యాయామం చేయడం వల్ల జాతి నడుము చేతులు బలపడతాయి.

ఈ వ్యాయామాలు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్లు వైద్యుల సలహా పాటించాలి ఇంట్లో చేసినా సరే జిమ్ కి చేసుకునే దుస్తులు తోనే వ్యాయామాలు చేయాలి వీటన్నిటిలో ఏ వ్యాయామం చేసినా ఆ పరికరాలు మన్నిక ఉండేటట్లు చూసుకోండి.

0 

Share


S
Written by
Sriharini

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad