Bluepadదయగల విద్యార్థి
Bluepad

దయగల విద్యార్థి

Gnanesh
Gnanesh
24th Jun, 2020

Share

కథ

కలకత్తాలోని ఒక పాటశాలలో ఇద్దరు మంచి విద్యార్థులు చదువుతూ ఉండేవారు. ప్రతి సంవత్సరం వారిద్దరిలో ఒకరు ప్రధమశ్రేణిలో రెండోవాడు ద్వితీయశ్రేణి లో ఉండేవారు. మొదటి విద్యార్థి తల్లి జబ్బుపడి మరణించింది. అందువల్ల ఆ విద్యార్థి రెండునెలల వరకు బడికి రాలేకపోయాడు. అందరూ ఈ మరు పరీక్షల్లో రెండవ విద్యార్థి మొదటి ర్యాంకు వస్తుందని భావించారు. పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత చూడగా, రెండు నెలల నుండి బడికి రాని విద్యార్థి మొదటి స్థానం లో నిలిచాడు. గురువు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇద్దరి జవబుపత్రలు చూడగా, రెండవ విద్యార్థి పూర్తి గా జవాబులు రాయకుండా వదిలేశాడు. అవికూడా ఎంతో సులువుగా ఉన్నా జవాబు రాయలేదు. ఏకాంతం గా ఆ విద్యార్దిని ప్రశ్నించగా అతను,"మొదటిస్థానం విద్యార్థి న కంటే కూడా ఎంతో తెలివైనవాడు బుద్దిమంతుడు. అతని తల్లి చనిపోయింది. దీని వల్ల చదువుకు ఆటంకం కలిగింది. నాకు మొదటి స్ధానం వచ్చే అవకాశం వచ్చింది. అయినా అది సరైనది అనిపించలేదు నేను కావాలనే సగం సగం జవాబులు రాశాను. నాకు అమ్మ ఉంది. పాపం అతనికి తల్లి లేదు దయచేసి మీరు ఈ విషయం మీలోనే దాచుకొండి. ఎవరికి తెలుప వద్దు" అన్నాడు.
గురువుకు ఆ విద్యార్థి యొక్క దయాగుణం ఎంతో సంతోషం కలిగించింది. అతడితో "అన్నిటికంటే ముఖ్యమైన పరీక్షలో ఉన్నత స్థానం లో నిలిచవు. ఈ పరీక్ష ముందు స్కూలు పరీక్షలో విజయం ఎన్నటికీ సాటిరాదు". అని ప్రశంసించాడు.
***********

2 

Share


Gnanesh
Written by
Gnanesh

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad