Bluepadజేఈఈ పరీక్షా ఉంటుందా..?
Bluepad

జేఈఈ పరీక్షా ఉంటుందా..?

G
Gayathri
23rd Jun, 2020

Share



ఈ పరీక్షల తో పాటు సీబీఎస్ఈ పరీక్షలు కూడా రద్దయ్యే అవకాశం ఉంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ రోజే నిర్ణయాన్ని వెల్లడిస్తుంది. సి బి ఎస్ సి కి సంబంధించిన 250 పాఠశాల లో పరీక్షలను రద్దు చేశారు అని కోర్టు దృష్టికి తల్లిదండ్రులు తీసుకు వచ్చారు. మన దేశం లో కూడా పరీక్షలను రద్దు చేయాలి మరియు అంతర్గత పరీక్ష మార్పుల ఆధారంగా విద్యార్థులు ను పాస్ చేయాలని తల్లిదండ్రులు పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు స్వీకరించి విచారణ చేస్తోంది మరియు రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఈ పరీక్షలను రద్దు చేయాలి అనే దాని గురించి సీ బీఎస్ఈ అధికారులను సంప్రదిస్తుంది పరీక్షలను రద్దు చేయాలని లేక వాయిదా వేయాలనే అంశంపై జూన్ 23 లోగా నిర్ణయం వెల్లడిస్తామని సీబీఎస్ఈ అధికారులు సుప్రీంకోర్టు కి తెలియజేశారు.

ఇంకో వైపు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ సీబీఎస్సీ ఎన్ టి ఏ పాఠశాల విద్యా శాఖ అధికారులు తరచూ సంప్రదిస్తూ సమావేశాలు నిర్ణయించుకున్నారు. సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖ లైన పిటిషన్ లో ఇది పరీక్షలన్నీ సాధ్యమా అసాధ్యమా అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ రద్దు చేస్తారా లేక వాయిదా చేస్తారా అన్నది ఈ రోజు వెల్లడించారు

కొన్ని రాష్ట్రాలు( ఒడిస్సా మహారాష్ట్ర ఢిల్లీ)
అయితే సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి మరికొన్ని రాష్ట్రాలు అయితే పరీక్షలు రద్దు చేసి ఇంటర్ పరీక్ష మార్కులు ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని కోరుతున్నారు. ఒక వేళ ఇంజనీరింగ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం నిర్వహించకపోతే ఆ ప్రభావం భవిష్యత్తు లో ఉంటుందని కేంద్రం చాలా తీవ్రంగా ఆలోచిస్తోంది ఈ కోవిద్ -19 పరిస్థితులను దృష్టి లో పెట్టుకొని పరీక్షా కేంద్రాల్లో రెట్టింపు చేయడం జరిగింది. ఒక వేళ ఈ పరీక్షను వాయిదా వేసిన లేదని చేసిన పరిస్థితులు మెరుగు పడక పోయినా ఈ పరీక్ష కేంద్రాల్లో ఇంకా పెంచడం జరుగుతుంది

అంతే కాకుండా ఆన్లైన్లో ఈ పరీక్షల్లో నిర్వహించాలనే ఆలోచన కూడా కేంద్రానికి ఉంది ఎన్ ఐ టి ఐఐటీల్లో ప్రవేశం కోసం జేఈఈ పరీక్షను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారు ఈ ఏడాది 1118673 మంది దరఖాస్తు చేసుకున్నారు. జేఈఈ మెయిన్లో సాధించిన మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించడం జరుగుతుంది 31 ఎంఐ టీవీలు 25 ట్రిపుల్ ఐటీలు 28 జి ఎఫ్ టి ఐ లో మీ బీటెక్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది ఈ మూడింటి లో మొత్తానికి 38704 సీట్లు ఉన్నాయి. ఒక వేళ ఐఐటీ చదవాలి ఐఐటీ లో చేరాలనుకునే వారు జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి జేఈఈ మెయిన్స్ నుంచి 250000 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు క్వాలిఫై అవడం జరుగుతుంది

అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సు లైన ఎంబీబీఎస్ బీడీఎస్ వంటి కోర్సులకు ప్రవేశ పరీక్ష నీట్ పరీక్ష ఈ సంవత్సరం ఈ పరీక్షకు 15.94 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే సీట్లను భర్తీ చేస్తారు.

10 

Share


G
Written by
Gayathri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad