Bluepad | Bluepad
Bluepad
హనుమంతుని వివిధ సమయాల్లో సేవించి తరించిన భక్తులు
A
Addepalli harikrishna
23rd Jun, 2020

Share


హనుమంతుని వివిధ సమయాల్లో సేవించి తరించిన భక్తులు

హనుమంతుని వివిధ సమయాల్లో సేవించి తరించిన భక్తులు
1 . మైందుడు
మైందుడను బ్రాహ్మణ శ్రేష్ఠుడు - చైత్రమాసంలో, పుష్యమి నక్షత్రాన "హనుమంతుని" పూజించి, పూర్ణమనోరదుడైనాడు.
2 . ధ్వజదత్తుడు
ధ్వజదత్తుడనే బ్రాహ్మణోత్తముడు - వైశాఖ మాసములో, ఆశ్లేషానక్షత్రమున "మారుతి" ని పూజించి,మహత్ ఐశ్వర్యములు పొందెను.
3 . యవనాశ్వుడు
యవనాశ్వుడను భూసురుడు - వైశాఖ బహుళ దశమినాడు "హనుమద్వ్రతము" చేసి, అపస్మార వ్యాధి నుండి విముక్తుడైనాడు.
4 . కపిలుడు
కపిలుడు వైశాఖ మాసమున వచ్చు అమావాస్యనాడు - "ఆంజనేయుడు" ను అర్చించి ముక్తి పొందాడు.
5 . గాలుడు
గాలుడు కిరాతకుడు - జ్యేష్టశుద్ధ విదియనాడు "హనుమంతుని" ని ఆరాధించి, కుష్ఠు వ్యాధి నుండి విముక్తుడైనాడు.
6 . ఇంద్రుడు
ఇంద్రుడు ఆషాడ మాసాన రోహిణీ నక్షత్రంలో "హనుమత్పుజ" కావించి, వృత్తిని సంపూరించెను.
7 . ద్రౌపది
ద్రౌపది ఆశ్వయుజ మాసం, మృగశిరా నక్షత్రాన "మారుతాత్మజు" ని పూజించి పరమ భక్తురాలు అని పేరు పొందెను.
8 . అగస్త్యుడు
అగస్త్యుడు కార్తీక శుద్ద ద్వాదశినాడు "పవమానసుతుని" పూజించి సముద్రమున జయించెను.
9 . సోమదత్తుడు
సోమదత్తుడు మార్గశిర శుద్ద త్రయోదశిలో "కేసరీ నందును" ని పూజించి, పోయిన రాజ్యమును మరల పొందెను.
10 .సుషేణుడు
సుషేణుడు గంధర్వుడు పుష్యమాసములో, ఉత్తరా నక్షత్రాన "ఆంజనేయుని" అర్చించి, గాన విద్యలో జగజ్జేగీయమానుడు అయ్యెను.
11 .నలుడు
విభీషణుని కుమారుడు, నలుడనువాడు మాఘమాసమున వచ్చు ఆర్ద్ర నక్షత్రంలో "కపీశ్వరుడు" ని సేవించి సర్వాభీష్టసిద్ధుడు అయ్యెను.
12 . అంగదుడు
అంగదుడు పాల్గుణ పునర్వసు నక్షత్రమున "హరిసత్తము" ని భజించి, యువరాజయ్యెను.
13 . అర్జునుడు
అర్జునుడు హస్తా నక్షత్రంలో కూడిన ఆదివారాన - "హనుమంతుని" పూజించి, అఖిలాండ కోటి బ్రహ్మదమునకే - సర్వ నిర్వాహకుడైన స్వామి శ్రీకృష్ణ పరంధాముని "సారధి" గా పొంది, తద్వారా కాలుడైనా జయించలేని భీష్మ ద్రోణాది మహావీరులను దునుమాడుట మనకందరికి తెలిసిన విషయమే!
14 . భీముడు
భీముడు మృగశిరా నక్షత్రయుక్త భాను (ఆది) వారాన "కపిసత్తముని" పూజించి శత్రుంజయుడు అయ్యెను.
15 . భరతుడు
భరతుడు ప్రతి శనివారం "హనుమత్పుజ" నొనరించి,మహాబలసంపన్నుడు అయ్యెను.
16 . దూర్వాసుడు
దూర్వాసుడు ప్రతి వైదృతి యోగాన "వాయుపుత్రుని" పూజించి, తపస్సిద్ధిని పొందేనని పెద్దవారు, తెలిసినవారు వక్కాణిస్తుంటారు.
హనుమంతుని వివిధ సమయాల్లో సేవించి తరించిన భక్తులు

12 

Share


A
Written by
Addepalli harikrishna

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad