Bluepadఖమ్మం లో పివి సింధు త్రీడి చిత్రం
Bluepad

ఖమ్మం లో పివి సింధు త్రీడి చిత్రం

sravya peddinti
sravya peddinti
23rd Jun, 2020

Share

పుసర్ల వెంకట సింధు (జననం 5 జూలై 1995) ఒక భారతీయ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. 2009 లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన ఆమె కెరీర్‌ లో ఉన్నత స్థాయికి ఎదిగింది. ఏప్రిల్ 2017 లో పుసార్ల వెంకట సింధు తన కెరీర్ కాలం లో, ఒలింపిక్స్‌ తో సహా పలు టోర్నమెంట్ల లో మరియు 2019 ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ లో స్వర్ణంతో సహా BWF సర్క్యూట్‌ లో పతకాలు సాధించింది. బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌ గా నిలిచిన తొలి భారతీయురాలు ఆమె. ఆమె ఎన్నో ఆటల్లో గెలిచి అనేక విజయాల్ని ఆమె అందుకుంది. అలానే ఆమె నైపుణ్యం తో అందరికి సుపరిచితమయింది.


పుసార్ల వెంకట సింధు  సెప్టెంబర్ 2012 లో 17 సంవత్సరాల వయసు లో BWF ప్రపంచ ర్యాంకింగ్‌ లో మొదటి 20 స్థానాల్లోకి ప్రవేశించింది. అలానే  2013 వ సంవత్సరం నుండి, సింధు  ప్రతి ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ లో 2015 మినహా పతకం సాధించింది. జాంగ్ నింగ్ తర్వాత ప్రపంచ ఛాంపియన్ ‌షిప్‌ లో ఐదు లేదా అంత కంటే ఎక్కువ పతకాలు సాధించిన రెండవ మహిళ ఆమె. పుసార్ల వెంకట సింధు  2016 సమ్మర్ ఒలింపిక్స్ ‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ గా నిలిచింది . స్పెయిన్ కరోలినా మారిన్ చేతి లో ఓడిపోయిన తర్వాత ఆమె రజత పతకం సాధించింది. 2020 జనవరిలో భారతదేశం లో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్ అవార్డు తో సత్కరించ బడింది సింధు. మార్చి 2015 లో భారత దేశం లో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డు తో సత్కరించ బడింది. 29 ఆగస్టు 2016 న భారత దేశపు అత్యున్నత క్రీడా గౌరవ  మైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందు కున్నారు పి వి సింధు.
24 సెప్టెంబర్ 2013 న బ్యాడ్మింటన్ కోసం అర్జున అవార్డును ప్రదానం చేశారు ఆమెకి. ఇలా అనేక విజయాల్ని అందుకుంది బ్యాడ్మింటన్ ఛాంపియన్ పి వి సింధు. సింధు 2016 చైనా ఓపెన్‌లో తన మొదటి సూపర్‌  సరీ టైటిల్‌ను గెలుచుకుంది మరియు 2017 వ సంవత్సరం లో మరో నాలుగు ఫైనల్స్‌ తో దక్షిణ కొరియా మరియు భారత దేశం లో టైటిళ్లను గెలుచుకుంది. దానికి తోడు, ఆమె 2018 కామన్వెల్త్ గేమ్స్ మరియు 2018 ఆసియా క్రీడల  లో ఒక్కొక్కటి రజత పతకాన్ని, ఉబెర్ కప్‌ లో రెండు కాంస్య పతకాలను గెలుచుకుంది.సింధు  14 సంవత్సరాల వయస్సు లోనే అంతర్జాతీయ సర్క్యూట్ ‌లోకి ప్రవేశించారు. కొలంబో లో జరిగిన 2009 సబ్ జూనియర్ ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ షిప్ ‌లో ఆమె కాంస్య పతక విజేత. 2010 ఇరాన్ ఫజ్ర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాలెంజ్ ‌లో, ఆమె సింగిల్స్ విభాగం లో రజత పతకాన్ని గెలుచుకుంది.   పీవీ సింధు 3డి చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఖమ్మం లోని సర్దార్ పటేల్ స్టేడియం బయట షట్లర్  పీవీ సింధు 40 అడుగుల త్రీడీ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంది. అక్కడకి  వచ్చి వీక్షిస్తున్నారు ప్రజలు. సుందరీకరణ లో భాగంగా అధికారులు నగరం లోని స్టేడియం తో పాటు పాఠశాలలు గోడలపై క్రీడాకారులు దేశ నాయకుల తో పాటు అవగాహన కల్పించే  చిత్రాలను కూడా వేయిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని విజయ్ స్వామి దంపతులు త్రీడీ చిత్రాలు గీస్తూ ఔరా అనిపిస్తున్నారు వీటి లో స్టేడియం గోడ పై  గీసిన చిత్రం విశేషంగా అలరిస్తోంది ఈ త్రీడీ చిత్రం నిజంగా చూడడానికి ఎంతో బాగుంది దీన్ని  చూడగానే ఈ చిత్రం నిజంగా ప్రజలని ఆకట్టుకుంటుందనే చెప్పాలి.

18 

Share


sravya peddinti
Written by
sravya peddinti

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad