Bluepadనేనొక విత్తనం..!!
Bluepad

నేనొక విత్తనం..!!

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
23rd Jun, 2020

Share

#నేనొక_విత్తనం...!!

మట్టిలోకి చేరాను
వర్షాలతో జీవం పోసుకున్న
భూమి లోపల పురిటినొప్పులు
బయటికి వచ్చేందుకు ఆరాటం
వచ్చే వరకు చేశాను పోరాటం
నేల లోపల పురుగులను
నేల వెలుపల పక్షులను
ఎదిగే కొద్ది జంతువులను
ప్రతిచోటా పడ్డాను ఇబ్బందులను
ధైర్యంగా వచ్చాను బయటికి
ప్రాణమిచ్చిన ఆకాశానికి
రెండు చేతులతో దండాలు
ఆశ్రయమిచ్చిన నేలకు
వేర్ల తో చెప్పాను కృతజ్ఞతలను
ఆకాశం అంతా నాన్నను చూస్తూ
అంత ఎత్తుకు ఎదగాలని
ప్రతినిత్యం తపించాను
కాండము బలిష్టం చేశాను
రెమ్మను కొమ్మ చేశాను
కొమ్మ కొమ్మకు రెమ్మలు సృష్టించారు
కోట్ల పువ్వులను పూయించిన
నా వంశం కోసం విత్తనాలను
మరలా నేను సృష్టించుకున్నాను
నేలతల్లి ఇచ్చిన బలముతో
వేర్లను కు బలం పెంచాను
ప్రతి సంవత్సరం వసంత నింపుకొని
చిగురాకుల తో కళకళలాడుతున్న
నా పుట్టుకను సహించని వాళ్లను
నేను ఇప్పుడు ఆదరిస్తున్నాను
నా నీడలో సేద తీరుతున్నారు
వారికి ఆహారం అందిస్తున్నాను
ఎందరికో ప్రాణాలు పోస్తున్నాను
ఈ జన్మను సార్థకం చేసుకున్నాను

#కొప్పుల_ప్రసాద్
#నంద్యాల


21 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad