Bluepadసూపర్ స్టార్ నిజంగా కూల్ ఫాదర్
Bluepad

సూపర్ స్టార్ నిజంగా కూల్ ఫాదర్

A
Ananth A.
23rd Jun, 2020

Share





దయగల, ప్రేమగల, సున్నితమైన, శ్రద్ధగల కొన్ని పదాలు నా తండ్రి తో నా సంబంధాన్ని వివరించగలిగాను మరియు నేను ముందుకు సాగగలను ... అతను నేను మరియు నేను ఉండటానికి ప్రయత్నిస్తున్నది నా పిల్లలకు !! ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్నా .. నువ్వు ఎప్పుడూ ఇలా ముందుకు వెళ్తావు .. "అని మహేష్ బాబు రాశారు.

మహేష్ బాబు కుటుంబం యొక్క మూడు తరాలు- కృష్ణ తన తండ్రి ఘట్టమనేని రాఘవయ్య చౌదరితో, మహేష్ బాబు తన తండ్రి కృష్ణ, గౌతమ్ మరియు సీతారాతో కలిసి వారి తండ్రి మహేష్ బాబుతో షేర్ చేసిన ఫోటో చాల బాగుంది. అయితే మహేష్ బాబు అలానే కృష్ణ కూడా అనేక సినిమాల్లో నటించి మంచి పేరు పొందారు.

బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. కథానాయకుడిగా 25కి పైగా చిత్రాల్లో నటించాడు. మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. హీరోగా మహేశ్ తొలి చిత్రం రాజకుమారుడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు వ్యాపార పరంగా పెద్ద విజయాల్ని సాధించకపోయినా మహేష్ నటనకు గుర్తింపు లభించింది. ఇలా మహేష్ బాబు ఎన్నో సినిమాల్లో నటించాడు ఒక్కడు, అతడు, సైనికుడు, దూకుడు, పోకిరి, సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు, సరిలేరు నీకెవ్వరూ ఇలా అన్ని ఇన్ని కాదు ఎన్నో సినిమాల్లో నటించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

రాజకుమారుడు (1999) లో ఉత్తమ నూతన నటుడు (నంది) వచ్చింది. నిజం చిత్రానికి ఉత్తమ నటుడు (నంది) అవార్డు లభించింది. ఒక్కడు (2002) ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు. అతడు (2005 ) ఉత్తమ నటుడు నంది అవార్డు కూడా వచ్చింది. ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు అతడు సినిమాకి వచ్చింది. ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు పోకిరీ (2006) కి వచ్చింది. ఉత్తమ నటుడు (నంది) దూకుడు (2011) లో వచ్చింది. ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు దూకుడు (2011), ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), ఉత్తమ నటుడు (నంది): శ్రీమంతుడు (2015) ఇలా ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు మహేష్ బాబు.

తన పిల్లల తో సరదాగా గడుపుతూ ఈ కూల్ డాడీ అక్కడ కూడ ఫెయిల్ అవ్వలేదు. చక్కగా వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఎంతో సరదాగా ఉంటాడు ఈ సూపర్ స్టార్. తన భార్య బిడ్డలకి తాను ప్రాముఖ్యత ఇస్తూ సమయం ఉన్న ప్రతీ సారి ఆనందంగా గడుపుతాడు ఈ హీరో. అయితే ఈ హీరో కి కరోనా వాళ్ళ మరెంత సమయం దొరికింది అనే చెప్పొచ్చు. మంచి డాడీ గా ఈ కూల్ ఫాదర్ ఎందరికో ఆదర్శం అనే చెప్పాలి. తన పిల్లలని ఎంతో ఉత్సాహంగా తయారు చెయ్యడం అన్ని నేర్పడం లో ముందు ఉంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

16 

Share


A
Written by
Ananth A.

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad