Bluepad | Bluepad
Bluepad
ఆర్థిక వేత్త విఠల్ ఇకలేరు
R
Reshma us
22nd Jun, 2020

Share


ఆర్థిక వేత్త  విఠల్ ఇకలేరు

ఆయన భార్య శేషు 92 సంవత్సరాలు ఆమె కూడా మంచి పేరు పొందారు ఆమె తెలంగాణ యువతి మండలి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈమె కూడా పలు సేవల తో బాగా ప్రసిద్ధి చెందారు. వీరికి ఒక కూతురు ఇద్దరు కొడుకులు కూతురు పేరు నివేదిత కుమార్ కొడుకులు సంజయ్ బారు చైతన్య వారు అయితే తన కొడుకు సంజయ్ బారు మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా పనిచేశారు.

విటల్ బారు నిజంగా చక్కటి సేవలందించారు చక్కగా ఆర్థికవేత్తగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు అన్న వార్త ప్రేక్షకులని కుంగ దీస్తోంది నిజంగా ఎంతో మంది ఈ వార్తతో దిగులు చెందారు. ఆర్థిక వేత్తగా రాణించిన విట్టల్ ఇకలేరు. విటల్ 1960వ సంవత్సరం లో ఉస్మానియా యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ గా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శిగా దశాబ్ద కాలం వరకు పని చేశారు. నిజంగా ఇది గొప్ప విషయమని చెప్పాలి. ఒకే శాఖ లో సుదీర్ఘ కాలం కార్యదర్శిగా కొనసాగిన ఏకైక అధికారి విట్టల్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ వైస్ చైర్మన్ గా వ్యవహరించారు. అంతే కాకుండా అంతర్జాతీయ ద్రవ్య నిధి సలహాదారులుగా పదో ఆర్థిక సంఘం సభ్యుడిగా విశిష్ట సేవలు అందించారు. బి ఆర్ విట్టల్.

ఆయన చేసిన సేవలు నిజంగా విశేషం ఎంతో మందికి ఆదర్శం నిజంగా ఎంతో మందిని ఇలా ఈయనని ఆదర్శంగా తీసుకుని రాణించాలి. డిపి ఆర్బిటల్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఏర్పాటు లో ముఖ్య భూమిక పోషించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లో జన్మించారు. ఆయన తండ్రి ఆచార్య బీవీ రాజనర్సు ఉద్యోగరీత్యా హైదరాబాద్ లోని స్థిర పడ్డారు. దీని కారణంగా విఠల్ గారు కూడా హైదరాబాద్ లో ని ఉద్యోగం చేయడం అలానే అక్కడే స్థిర పడడం కూడా జరిగింది.

బి విఠల్ హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న సమయం లో విటల్ క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొన్నారు. అప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ తో విట్టల్ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయట. ఆ తర్వాత బి విఠల్ ఉన్నత విద్య మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ లో పూర్తయింది ఆ కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయుడు మన విఠల్.

ఇదిలా ఉంటే ఆయన 1950 లో అధికారి ఆర్థిక రంగం లో నిష్ణాతుడైన విఠల్ పలు పుస్తకాలు కూడా రచించారు. ఇప్పుడు ఆయన మరణించడం తో ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానం లో శనివారం జరుగనున్నాయి. విట్టల్ మృతికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు బీ విఠల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ఆయన తెలిపారు.

25 

Share


R
Written by
Reshma us

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad