ఈ గ్రహణాన్ని వీక్షించి డానికి ప్రత్యేకించి రూపొందించిన గ్లాసులు ఎక్స్రే ఫిలింలు తెచ్చుకొని గ్రహణాన్ని కొందరు చూశారు. గ్రహణం అనంతరం సముద్ర స్నానాలు చేసుకొని ఇంటికి వెళ్లారు గ్రహణం ప్రారంభం అవ్వక ముందు తెల్లవారు జామునే తీరానికి పండితులు చేరుకున్నారు సముద్ర స్నానం చేసి అక్కడ ఇసుక పై కూర్చొని జపం ప్రారంభించారు మరియు గ్రహణం పూర్తయిన తర్వాత మళ్లీ సముద్ర స్నానం చేసుకుని ఇంటి కి వెళ్ళి పోయారు.
గ్రహణం సందర్భంగా కొంత మంది బ్రాహ్మణులకు దానాలు చేసి దోష పరిహారానికి పొందారు ఇవే కాకుండా భారత నాస్తిక కేంద్రం ఆధ్వర్యం లో అంబేద్కర్ భవన్ లో వంటలు చేసి భోజనాలు చేశారు. ఈ సభ్యులు పూజలు దానాలు చేయడం లో అర్థం లేదని పేర్కొన్నారు. సూర్యుడిని పాము మింగడం వల్ల సూర్య గ్రహణం రాదని ఖగోళం లో జరిగే మార్పుల వల్ల సూర్యుడికి భూమి కి మధ్య చంద్రుడు అడ్డు రావడం తో ఈ సూర్య గ్రహణం ఏర్పడు తుందని భారత నాస్తిక సమాజం సభ్యులు చెప్పారు.
కొంత మంది గ్రహణ సమయం లో ఆహారం నీరు తీసుకో కుండా పది గంటల నుండి రెండు గంటల వరకు ఉపవాసం కూడా ఉన్నారు అయితే గర్భిణీలు మాత్రం ఇంటికే పరిమిత మయ్యారు మరియు సూర్య గ్రహణం వల్ల సింహాచలం వరాహ లక్ష్మీ నర సింహ స్వామి సంపత్ వినాయక ఆలయం కనక మహా లక్ష్మి కాళీ మాత ఇలా అన్ని ఆలయాలను కూడా మూసి వేశారు. ఇలా నిన్న ఏర్పడిన సూర్య గ్రహణం తో ప్రజలు ఈ విధంగా నడుచు కోవడం జరిగింది.
గ్రహణం పూర్తయిన తర్వాత ఆలయాలు తెరిచి సంప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తయిన సరే భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వ లేదు గ్రహణం అయినాసరే ఆదివారం కావడం తో ఎవరి ఇళ్లకు వారు పరిమితమై ఉన్నారు. దాంతో అన్ని రహదారులు ఖాళీగా ఉన్నాయి. మాంసాహార వ్యాపారం కూడా సూర్య గ్రహణం కారణంగా తగ్గింది గ్రహణం వల్ల ఈ ఆదివారం ఇలా గడిచింది.
విశాఖపట్నం లో మాత్రమే కాకుండా నెల్లూరు జిల్లా లో కూడా పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడింది. సూర్య గ్రహణం సందర్భం గా తైవాన్ లో సూర్యుడు ఉంగరం రూపం లో కనిపించాడు. దీనితో బాగా ఆసక్తి తో అక్కడ ప్రజలు సూర్య గ్రహణం ని వీక్షించడం జరిగింది. నిజంగా ఇది విడ్డురమే కదా..? మరియు కర్నూలు జిల్లా లో సూర్యుడు నవ్వుతున్నట్లుగా కనిపించాడు. నిజంగా ఇది కూడా చెప్పుకోదగ్గ విషయం అనే చెప్పొచ్చు. విజయవాడ లో కనక దుర్గమ్మ ఆలయం ని కూడా మూసి వేయడం జరిగింది.అయితే అక్కడకి కూడా దర్శనానికి అనుమతి ఇవ్వలేదు. సోమవారం తెల్లవారు జాము నుండే అక్కడికి అనుమతి ఇచ్చారు.