Bluepadసాహిత్యం
Bluepad

సాహిత్యం

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
22nd Jun, 2020

Share

సాహిత్యం..!!

హృదయాన్ని మథిస్తుంది
అక్షరాన్ని శోధిస్తుంది
భావాల పంట పండిస్తుంది
కావ్యమై అలరిస్తుంది..!!

ఆలోచనలను పుట్టిస్తుంది
సమాజాభివృద్ధికి పాటుపడుతుంది
మార్పు కి శ్రీకారం చుడుతుంది
అక్షర రూపమై నడిపిస్తోంది...!!

అన్యాయాన్ని నిలదీస్తుంది
అభ్యుదయాన్ని సంఘటితం చేస్తుంది
ప్రశ్నలను సంధిస్తోంది
అక్షరం ఉప్పెనై కదులుతోంది..!!

బ్రతుకును వికసిస్తుంది
జీవనాధారం చూపిస్తుంది
జీవితమై సాగిస్తుంది
అక్షర సాగరమై నిలుస్తుంది..!!

కమ్మని పాటలు పాడుతుంది
విప్లవ గీతమై తిరుగుతుంది
మనసు రగిలి శోకిస్తుంది
అక్షరం కన్నీరై పారుతుంది ..!!

ప్రణయాన్ని ప్రేమిస్తుంది
విరహాన్ని తపిస్తోంది
అనుబంధాలను గౌరవిస్తుంది
అక్షర సుగంధ మై వ్యాపిస్తుంది..!!

ప్రకృతిని వర్ణిస్తుంది
వెన్నెల్లో విహరిస్తుంది
నవరసాలు ఒలికిస్తుంది
అక్షర వర్షమై కురిపిస్తుంది..!!

#కొప్పుల_ప్రసాద్
#నంద్యాల

16 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad