Bluepadనాన్న - జీవితం వచన కవితా సౌరభం
Bluepad

నాన్న - జీవితం వచన కవితా సౌరభం

j
jayanth kaweeshwar
21st Jun, 2020

Share

నాన్న- జీవితం -(వచనకవితాసౌరభం)
ఇలపై నిల్పిన సంకల్ప  హేతువులు అమ్మా నాన్నలు
జీవన గమ్యాన్నిఅవగాహన కల్పించిన పృథ్వీ లోక దేవతలు
చదువు సంధ్యలందు ,ఆట పాటల అందు మార్గదర్శకుడు ఈ నాన్న
బంధాలను, అనుబంధాలను ఈ లోకం లోపాటించి,పాటింప జేసిన నాన్న.
సంసారాన్ని ఏ విధంగా సాగించాలో , మంచి కుటుంబాన్ని ఎలా నిర్మించాలో
ఆచరించి చూపించిన ఈనాన్నగారు. చిరకాలంగా గుర్తుంచుకునే ఆతని పిల్లలు.
పండుగలు ,సంప్రదాయాలను అనుసరించి , అనుసరింప ఈనాన్న మా నాన్న .
బొమ్మరిల్లు సినిమాలో  చెప్పినట్లు గా  "అంతా మీరే చేశారు అని అన్నట్లుగా"
నాన్న ఆలా చేయడం వల్ల  మనకు (పిల్లలకు) దారి తప్పకుండా, క్రమ పద్ధతిలో
జీవింప జేసిన పధ్ధతి ఆచరణీయం , మనం సంపాదిస్తే  మన ఇల్లు నిలుస్తుంది.
చిన్నప్పటినుండి వివిధ ఆచరణీయ మార్గాలను  అనుసరించే విధం  నేర్పిన నాన్న.
ఇప్పటికీ , ఎప్పటికీ ఆదరణీయుడు మీ, మా ,  మన నాన్న .చిర, మధురస్మృతులను పంచిన
నిరంతర శ్రమ  జీవి , కరుణా మూర్తి ఆ, ఈ, మన నాన్న .
21.06. 2020 నాటి  అంతర్జాతీయ పితృ దినోత్సవ శుభాభినందనలతో
*********************** కవీశ్వర్ .
కే. జయంత్ కుమార్ ,
రాజేంద్ర నగర్ , హైదరాబాద్ .

9 

Share


j
Written by
jayanth kaweeshwar

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad