Bluepadఓ సైనికా......
Bluepad

ఓ సైనికా......

d
dedeepya sai
21st Jun, 2020

Share

మా కోసం అర్పిస్తావు నీ ప్రాణం
మంచు కొండలను సైతం
లెక్క చేయని నీ ధైర్యం,
అదే మాకు స్ఫూర్తి పథం.
దేశమే నీ గృహం
పౌరులే నీ కుటుంబం
దేశ రక్షణ నీ కర్తవ్యం.
నీ కళ్ళల్లో పౌరుషం,
గుండెల్లో సాహసం,
అదే మాకు ఆదర్శం.
నీలోని ప్రతి కణం,
అనుక్షణం రగిలిస్తుంది దేశభక్తి భావం
నీవు పొంది మరణం,
మాకు పోస్తున్నావు జీవం.
తలుస్తూ నీ త్యాగం ప్రతి క్షణం,
తీర్చుకుంటాము నీ ఋణం.
ఓ సాహస వీరుడా!
ఓ సైనికుడా!!
ఓ భరతమాత ముద్దు బిడ్డడా!!!
ఇవే మా జోహార్లు......
**********

15 

Share


d
Written by
dedeepya sai

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad