Bluepadఇంటర్నేషనల్ ఫాదర్స్ డే గురించి మీకోసం....
Bluepad

ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే గురించి మీకోసం....

A
Arvind Kumar
21st Jun, 2020

Share




నిజంగా కుటుంబంలో తండ్రి చక్కటి పాత్ర పోషిస్తాడు అన్ని విధాలుగా తండ్రి కుటుంబానికి సహాయం చేస్తాడు. ప్రతి రోజు కూడా బాధల్ని పంచుకోవడం, అవసరం బట్టి సహాయం అందించడం ఇలా అనేక విధాలుగా తండ్రి సహాయం చేస్తూ ఉంటాడు. అయితే నాన్న నిజంగా ఎన్నో నేర్పిస్తాడు. మనల్ని సరిగ్గా పెంచుతూ లాలనా పాలనా చూసుకుంటూ చదువు నుండి ఉద్యోగం వరకు ఇలా ప్రతి సమయం లో కూడా ఒక బాటగా ఉంటాడు ఎక్కువసేపు మనతో సమయాన్ని వెచ్చించిచకపోయినా ఆయన మాత్రం అడుగులో అణువణువులో బాటలా మార్గదర్శకమై, ఆదర్శమైన జీవితాన్ని ప్రోత్సహిస్తారు.

ఇలా చెప్పుకుపోతే తండ్రి గురించి ఎంతో ఉంది. అయితే తండ్రి నిజంగా ప్రతి ఒక్కరి జీవితం లో ముఖ్య పాత్ర పోషిస్తాడు. అయితే ఈ తండ్రి రోజునఎలా జరుపుకుంటారు...? ఎప్పుడు జరుపుకుంటారు...? ఎందుకు జరుపుకుంటారు....? అసలు ఈ దినోత్సవాన్ని ఎలా చేసుకుంటారు...? ఎందుకు వచ్చింది ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా.....? మరి ఆలస్యం చేయకండి చదివేయండి....
అయితే వివిధ ప్రాంతాల్లో వివిధ తారీకుల్లో ఈ రోజు జరుపుకుంటారు.రష్యా లో ఫిబ్రవరి 23 న జరుపుకుంటారు. అలానే మే సెకండ్ సండే రోజు రొమానియా లో జరుపుకుంటారు స్విజర్లాండ్ లో జూన్ మొదటి ఆదివారం నాడు జరుపుతారు. డెన్మార్క్లో జూన్ 5వ తారీఖున జరుపుతారు ఆస్ట్రేలియాలో జూన్ రెండవ ఆదివారం లో జరుపుతారు. బెల్జియంలో కూడా జూన్ రెండో ఆదివారం నాడు జరుపుతారు. జూన్ 3వ ఆదివారం నాడు శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, జింబాబ్వే, నైజీరియా, కంబోడియా, చైనా, జపాన్ , జెర్సీ, ఒమాన్ ఇలా వివిధ దేశాల వారు జరుపుతారు. అయితే ఇండియాలో మాత్రం జూన్ మూడవ ఆదివారం నాడు జరుపుతారు ఎక్కువగా హైదరాబాద్ చెన్నై ముంబై న్యూఢిల్లీ కాన్పూర్ బెంగళూరు కోల్కతా పూణే వంటి ప్రదేశాల్లో ఈ ఫాదర్స్ డే ని ఘనంగా జరుపుతారు

ఫాదర్స్ డే అనేది పితృత్వాన్ని మరియు పితృ బంధాలను గౌరవించే రోజు, అలాగే సమాజంలో తండ్రుల ప్రభావం. ఐరోపాలోని కాథలిక్ దేశాలలో, దీనిని మధ్య యుగం నుండి మార్చి 19 న సెయింట్ జోసెఫ్ డేగా జరుపుకుంటారు. అమెరికాలో, ఫాదర్స్ డేను సోనోరా స్మార్ట్ డాడ్,
స్థాపించారు మరియు జూన్ మూడవ ఆదివారం 1910 లో మొదటిసారి జరుపుకున్నారు. ఇది ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వివిధ రోజులలో జరుగుతుంది సంవత్సరం, తరచుగా మార్చి, మే మరియు జూన్ నెలల్లో. కాప్టిక్ ఆర్థోడాక్స్ చర్చిలో, సెయింట్ జోసెఫ్ దినోత్సవం సందర్భంగా పితృత్వ వేడుకలు కూడా జరుపుకుంటారు, కాని కోప్ట్స్ దీనిని జూలై 20 న పాటిస్తారు. కాప్టిక్ వేడుక ఐదవ శతాబ్దం నాటిది.

ఇలా అప్పటి నుండి కూడా ఈ ఫాదర్స్ డే ని జరుపుకోవడం జరుగుతున్నది. పురుషుల దినోత్సవం వంటివి కూడా ఇక్కడ మనం జరుపుకుంటాం.

13 

Share


A
Written by
Arvind Kumar

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad