Bluepadనాన్నలు ఘనమైన త్యాగధనులు
Bluepad

నాన్నలు ఘనమైన త్యాగధనులు

E
Emmadi Rambabu
21st Jun, 2020

Share

*ఘనుడైన నాన్నకు నివాళి.. త్యాగమూర్తి నాన్నలకు..అంకితం.(శీర్షిక)*
నా జన్మ వర ప్రదాయిని గా.. ఘనుడైనాడు నాన్న.
నా ఉన్నతికి చెమటను రక్తంలా అందించాడు నాన్న.
నా తొలి చిరునవ్వుతో.. త్యాగధనుడైనాడు నాన్న
నా తొలి అడుగును ..
గుండెలపై వేసుకుని.. తన్మయుడైనాడు..నాన్న
నడవడిక లో..తప్పటడుగు పడితే తల్లడిల్లే ..నాన్న .
ఘనుడాయే సరిదిద్ది.. త్యాగధనుడైన నాన్న.
నా పాదాలు కందిపోతయని భుజాన మోసేను ..నాన్న.
తన కష్టాలు తెలవనీక.. గుందెలోతుల్లో దాచాడు నాన్న.
సన్మార్గప్రదాతగా ..
అందలమెక్కెంచే నాన్న గురువై.
నా సంతోషమే తనదిగా..భావించె
త్యాగదనుడై నాన్న.
నా అల్లరి పనులతో ..
విసుగు చెందని నాన్న
గుండెలనత్తుకూని..
ఓదార్చేను ఘనుడైన నాన్న.
నా కంట కన్నీరు రానివ్వక ..
తన కన్నీరింకించే నాన్న.
నా దైవం ఘనమైన నాన్న.
.ప్రేమ మూర్తి నాన్న
అర్పిస్తున్న త్యాగ మూర్తి నాన్నకు ఘన నివాళి... త్యాగధనుల నాన్నలకు అంకితం.
రచన ఇమ్మడి రాంబాబు
తొర్రూరు , జిల్లా: మహబూబాబాద్
వాట్సప్ ,నా ఫోన్ నంబర్ 9866660531

16 

Share


E
Written by
Emmadi Rambabu

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad