(పితృ దినోత్సవ శుభాకాంక్షలతో...)
#నాన్న_తోడుంటే...!!
మా నాన్న నాకు గుర్తులేదు
నా రెండేళ్ళ వయసులోనే
ఈ లోకం విడిచే..!!
నాన్న పదం విన్నప్పుడు
మనసంతా వేదన భరితం
ఆయన ప్రేమ పొందలేని
అభగ్యడ నైతిని ..!!
నాన్న అని పిలిచే సమయానికి
నాన్న చెంత లేడని తెలిసి
పసి హృదయములో
ఎన్నో ఘర్షణలు
ఎన్నో వేదనతో ఆప్యాయతను
నోచుకోని దరిద్రుడా నైతిని...!!
నాన్న వేలు పట్టి నడిచిన గుర్తులు
జ్ఞాపకాలలో ముద్రలు లేవు
తప్పటడుగులు సరిదిద్దే
నాన్న తోడు లేని
నిర్భాగ్యుడు నైతిని...!!
నాన్న ఎల్లప్పుడూ తోడుగా నిలిచి
ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడును
నా కన్నీరు తుడిచేందుకు
రాడని తెలిసి కన్నీరు ఆగిపోయింది
నాన్న ప్రేమ పొందలేని
తోడులేని అనాధ నైతిని..!!
నాన్న గురించి అందరూ గొప్పగా చెప్తే
అందులోని మాధుర్యం తెలియదు
నాన్నంటే ఆకాశం అన్నారు
ఆకాశాన్ని చూస్తూ దుఃఖిస్తూ
తెలియని బాధతో మనసులో
నిస్సహాయుడు నైతిని..!!
అందరికీ నాన్న తోడుంటే బలం
ఆ బలం నాకు లేక
జీవితంలో ఎలా సాగునో.
నానే నాకు తోడుంటే
నా జీవితం ఎలా ఉండునో...??
తోడులేని బాటసారి నైతిని..!!
కొప్పుల ప్రసాద్
నంద్యాల