Bluepadగ్రహణం అంటే ఏంటి ...? ఈ గ్రహణ సమయంలో ఏం చేయాలి...?
Bluepad

గ్రహణం అంటే ఏంటి ...? ఈ గ్రహణ సమయంలో ఏం చేయాలి...?

s
snehita chitla
21st Jun, 2020

Share

వివిధ రాశులపై ఈ గ్రహ ప్రభావం గురించి జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి సర్వమానవాళి ని భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో సూర్య గ్రహణం రావడం కూడా జరిగింది అయితే ఈ నెల 21వ తేదీన ఏర్పడే సూర్య గ్రహణం ప్రభావం ఆరోగ్యరీత్యా ఎలా ఉంటుందన్న ఆందోళనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యం లో జ్యోతిష్య పండితులు సూచనలు ఇస్తున్నారు. ఆ సూచనలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా....? మరి ఆలస్యం చేయకుండా ఈ ఆర్టికల్ ని చదివేయండి




అయితే సూర్య గ్రహణాలు అమావాస్య రోజున ఏర్పడతాయి ఈనెల 21వ తేదీన ఆదివారం ఉదయం ఏర్పడే గ్రహణాన్ని చూడమని నామక సూర్యగ్రహణం అని పిలుస్తారు అయితే ఇది ఆదివారం ఉదయం సుమారు 10:14 కు ప్రారంభమై మధ్యాహ్నం దాదాపు 01:51 ముగిస్తుంది అయితే కొన్ని ప్రాంతాల వారికి కొన్ని హెచ్చుతగ్గులు ఉండవచ్చు

అయితే ఈ సూర్య గ్రహణం రోజు గురించి జ్యోతిష్యులు ఏమంటున్నారు ఏ రాశి పై ప్రభావం పడింది. అయితే ఈసారి ఇది మిధున రాశి లో సంభవిస్తుంది. కాబట్టి మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్రాల వారు చూడకూడదు అని పండితులు చెబుతున్నారు. అయితే మేష రాశి కన్య రాశి మకర రాశి సింహ రాశి వారికి ఈ గ్రహణం శుభ ఫలితాలను అందిస్తుంది. ఇదిలా ఉండగా వృషభ రాశి ధనస్సు రాశి తులా రాశి కుంభ రాశి వారికి మధ్య ఫలం లభిస్తుందని చెబుతున్నారు. మిధున రాశి వారికి వృశ్చిక రాశి వారికి కర్కాటక రాశి వారికి మీన రాశి వారికి అధమ ఫలం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అయితే ఈసారి గ్రహణం మిధున రాశి పై సంభవిస్తుంది. కాబట్టి మిధున రాశి వారు శాంతులు చేయించుకోవడం శ్రేయస్కరమని సూచన. ఈ సారి మాత్రమే కాదు ప్రతి సారి కూడా ఏ రాశి మీద అయితే గ్రహణం సంభవిస్తుందో వాళ్ళు దానాలు శాంతులు వివిధ కార్యక్రమాలు చేపడితే వాళ్ల మీద ప్రభావం పోతుంది అని ఎప్పటి నుంచో మన పూర్వీకులు చెబుతున్నది.

గ్రహణ సూచనలు సనాతనులు సూచించే విషయాలు మీకోసం.... గ్రహణం సందర్భంగా సనాతలు పలు సూచనలు ఇచ్చారు. అయితే వాటి ప్రకారం గ్రహణ సమయం లో నక్షత్ర జపాలు చేసుకోవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల వాళ్ళకి చాలా శ్రేయస్కరం అంతే కాకుండా గురు ముఖంగా ఉపదేశం పొందిన మంత్రాలు జపం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళకి శ్రేయస్కరం. సూర్యస్తుతి సూర్య గాయత్రి చదువుకోవడం కూడా మంచిది. అలానే పూజా మందిరం లోని దేవత విగ్రహాలను శుద్ధి చేయాలి.

గ్రహణం పట్టిన తరువాత ఆ విగ్రహాలను శుద్ధి చేయాలి. అలానే గ్రహణం అయిపోయిన తర్వాత దీపారాధన చేసి సూర్యుడికి ప్రీతికరమైన పరవాన్నం నివేదించాలి. అలానే గ్రహణానికి ముందు వండిన పదార్థాలు తినకూడదు. స్నానం తర్వాత మాత్రమే తినాలి. అలానే గ్రహణ సమయం లో దైవ స్మరణ తో మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందుకే మన తాతలు ముత్తాతలు గ్రహణ సమయం లో జపం చేసుకోవడం లేదా ఏదో ఒక మంత్రం చెప్పు కోవడం జరుగుతుంది.

20 

Share


s
Written by
snehita chitla

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad