Bluepadఅరకు కాఫీ విశిష్టత..
Bluepad

అరకు కాఫీ విశిష్టత..

G
Gayathri
20th Jun, 2020

Share

లేకపోతే రోజు ఎంతో డల్ గా ఉంటుంది. అయితే కాఫీ నిజంగా ఒక బెస్ట్ ఫ్రెండ్ లా మారి పోతుంది కాఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ప్రత్యేకమైన అరకు కాఫీ గురించి చెప్పుకునే తీరాలి.... అరకు కాఫీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా.....? మరి ఆలస్యం చేయకండి అరకు కాఫీ గురించి పూర్తిగా తెలుసుకోండి....




ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ 1960 లో విశాఖపట్నం జిల్లా లో రిజర్వ్ అటవీ ప్రాంతం లో కాఫీ పంటను 10 వేల ఒక వంద ఎకరాలు అభివృద్ధి చేశారు. అక్కడ ఉన్న గిరిజనులు ఈ కాఫీ తోటలు పండిస్తూ ఉంటారు. అయితే 1985లో వాటికి అభివృద్ధి సంస్థకు అప్పచెప్పారు అటవీ అభివృద్ధి సంస్థ చెప్పారు. 1956లో గిరిజన సహకార సంస్థ ఏర్పడ్డాక కాఫీ బోర్డు వారు ఈ సంస్థని కాఫీ తోటలు అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని ఉద్దేశించారు.

అయితే అప్పటి నుంచి కూడా గిరిజనులు ద్వారా కాఫీ తోటల పెంపకం లో జీసిసి కృషి చేయడం ప్రారంభమైంది. 1975 నుండి 85 వరకు జీసీసీ లో ఒక ప్రత్యేక కాఫీ తోటలు అభివృద్ధి విభాగం పని చేస్తూ సుమారు నాలుగు వేల హెక్టార్ల కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలైంది అయితే అరకు లో తయారవుతున్న ఈ కాఫీ విశ్వ వ్యాప్తంగా గుర్తించబడింది. జీసీసీ ద్వారా జి సి పి డి సి ద్వారా అభివృద్ధి చేసిన కాఫీ తోటలు గిరిజన రైతులకు ఒక కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున పంచి ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ కాఫీ తోటి అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలని నిర్వహించి దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కాఫీ తోటలు గిరిజన రైతుల ద్వారా సాగు చేయడం జరుగుతుంది.

అరకును పర్యటించడానికి వచ్చిన పర్యాటకుల ద్వారా ఈ కాఫీ కొనుగోలు బాగా ఎక్కువగా జరుగుతుంది. అంతే కాకుండా అక్కడ నుంచి షాపులకు కూడా ఈ కాపీని సప్లై చేయడం జరుగుతుంది. ఇలా ఎంతో మంది ఈ ఆర్గానిక్ కాఫీ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అరకు కాఫీ యొక్క ప్రాముఖ్యత 2003 నుండి 2012 మధ్య కాలం లో అంటే సుమారు పదేళ్ల లో విశాఖ కాఫీ ఏడు సార్లు రీజినల్ స్థాయి అవార్డులు పొందింది.
జీకేవీధి చింతపల్లి పెద్దబయలు మినుములూరు అనంతగిరి అరకు లోయ తోటల్లో సాగు అయిన ఈ కాఫీ గింజలు నాణ్యమైనవిగా కాఫీ పంట నిపుణులు తేల్చారు. కాఫీ చక్కటి గుర్తింపు లభించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇలా అక్కడికి వచ్చేవాళ్లు ఈ కాఫీ పౌడర్ని కొనుక్కోవడం అలానే చుట్టు పక్కల ఉన్న కొన్ని ఊర్లలో అరకు కాఫీ ని తయారు చేసి అమ్మడం తెలిసిన విషయమే. ఎప్పుడైనా అరకు కనుక మీరు మీరు వెళ్తే తప్పక కాఫీ రుచి చూడాల్సిందే.

21 

Share


G
Written by
Gayathri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad