శీర్షిక: #జన్మభూమి
పల్లవి:
జన్మ భూమి రుణం తీరనిది
వీరుని మరణం మరువలేనిది
చరణం:
సరిహద్దులోని సైనికులారా
భరతమాత వీర బిడ్డలారా
కంటికి రెప్పలా కాపాడే వీరుల్లారా
దేశం యావత్తు అర్పిస్తుంది సలాం
!! జమ్మ భూమి రుణం తీరనిది!!
కంటినిండా నిద్ర మరచి
కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతూ
సరిహద్దులు ప్రతిక్షణం సంరక్షిస్తూ
దేహానికి తూట్లు పడ్డ దేశ రక్షణ శ్రమిస్తూ తూ
!! జన్మ భూమి రుణం తీరనిది!!
కొండల్లో కోనల్లో అనుక్షణము తపిస్తూ
శత్రువు గుండెల్లో స్వప్నమై నిద్రిస్తూ
దేశ రక్షణకై అనంతరం కృషి చేస్తూ
వీర మరణాన్ని స్వాగతిస్తూ
!! జన్మభూమి రుణం తీరనిది!!
జననీ జన్మ భూమి అంటూ
కన్నతల్లి లాంటి దేశానికి
మీరు చేసే సేవలకు తీరనిది నీ రుణం
భరత జాతి మొత్తం గర్విస్తోంది ప్రతిక్షణం
!! జన్మభూమి రుణం తీరనిది!!
కొప్పుల ప్రసాద్
నంద్యాల