Bluepadపెరుగు కథ
Bluepad

పెరుగు కథ

S
Surya_Kolluri
20th Jun, 2020

Share

ఉదయం 5 గంటల సమయం. సూర్యుడికి దారం కట్టి ఆ బరువును లాగి తెస్తున్న ఆ గువ్వల సందడి మొదలు అయింది. పచ్చని పొలాలు నిశిని చీల్చి హాయిగా గాలికి స్వాగతం ఇస్తుంది. ఆ చల్లని గాలిలో వెచ్చని హాయిలో ఇంక ఏవో శబ్దాల అలికిడి వినిపిస్తోంది.
ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో పెద్ద మనుషులు అని చెప్పుకునే కొంత మంది మామూలు మనుషుల నోటి మాటలు అవి. ఆ నోరులకి ఈ రోజు దొరికిన విషయం నిన్న జరిగిన రామి నాయుడు కూతురు పెళ్లి.
వారి మాటలలో ఉన్నది పెళ్లి లో వారికి వడ్డించిన పెరుగు కోసం. అందులో రామయ్య అంటున్న మాటలు ఇవి "చూశావా చంద్రం!! ఆ రామి నాయుడు పెళ్లి లో ఎంత వెక్కిరించాడో!! అంతేలే కొందరికి పెరుగు, ఇంకొకరుకి మజ్జిగ, ఇంకొందరకి నీళ్ళే అనిపించాయి అంటా!!" ఏమిటో ఆ మనిషి. నువ్వే ఏమీ అంటావు చంద్ర. నేనేమి అంటాను రామయ్య. నువ్వు అన్నది నిజమేగా. ఆ రామి నాయుడు కోసం తెలియని మనిషి ఎవడు.
ఆ రామి నాయుడు స్నేహితుడు ఉన్నాడుగా రఘు. తను ఏదో ఒకటి చెప్పుతాడు అని ధైర్యం. ఏమీ చెప్పిన మన వాదన మనదేగా. వాళ్ల మాటలు నమ్మముగా మనం.
ఇంతలో ఆ చెట్టు పై ఉన్న పిచ్చుక అరుపుకి అటు వస్తున్నా రామి నాయుడుని చూశారు. బహుశా ఆ పిచ్చుకలు కూడా వీళ్ల మాటలకి మచ్చుకు అయ్యాయి ఏమో. ఆ పిచ్చుక అయితే వాళ్ల మాటలు మార్చేలా చేసింది కానీ వాళ్ల మనసులని మార్చాలే కదా?!.
అలవాటు గానే రామి నాయుడు కి అర్దం అయింది వాళ్ల మాటలు తన కోసం అని. తన తెలివైన మిత్రుడు వెంట ఉన్నాడు అనే భరోసా వల్ల ఆ మాటలు ఏవీ పట్టనట్లు వాళ్ళని పలకరించాడు. వాళ్లు కూడా ఎక్కడ లేని మమకారంతో పలకరించారు. పెళ్లి బాగా చేశావు అంటునే పెరుగు సంగతి వెటకారంగా మాట్లాడారు. అంతా విని నవ్వుతూ వెళ్లిపోయాడు రామి నాయుడు.
వెంట వచ్చిన రఘుకి మాత్రం వాళ్ల మాటలకి సమాధానం ఇవ్వాలి అనిపించింది. వాళ్ల పక్కన చేరి ఒక్కోక్కరికి ఒక్కోలా పెరుగు కాదు. ముందు వెళ్లిన వాళ్లకి పెరుగు అందింది. కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ మంది తో వచ్చారు రామి నాయుడు మంచితనం వల్ల. దానితో చివరకు మజ్జిగ అయింది. మంచికి వచ్చిన వాళ్లు పెళ్లి చూశారు కానీ కొంత మంది వెక్కిరింతకి వచ్చారు. అది జరిగింది. ఇంకా వెళ్తా!!
అవున్నట్టు మరిచిపోయా.!! విందు అయితే ఎక్కువ మంది వల్ల మజ్జిగ పలచన అయింది. అదే బందం అయితే ఎక్కువ గొడవలు, ఎక్కువ కలహాలు వల్ల పల్చన అవుతుంది. మాటలు మనలో కలహాలకి కారణాలు. అర్దం అయ్యింది అనుకుంటా!!

21 

Share


S
Written by
Surya_Kolluri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad