Bluepadమనిషి=అవసరాల కోసం దారులు తొక్కే పాత్ర
Bluepad

మనిషి=అవసరాల కోసం దారులు తొక్కే పాత్ర

సన్నిధి రాజు శివ సుబ్రహ్మణ్యం
సన్నిధి రాజు శివ సుబ్రహ్మణ్యం
19th Jun, 2020

Share

నలువైపుల చీకటి కమ్మేసింది
నా నీడే నాకు కనిపించలేదు
తోడు-నీడ రెండు నాతో లేవు
ధైర్యంతో ఒకవైపు అడుగేశా
ముళ్లదారి-పాదాల నుండి రక్తం చిమ్మింది బాధతో మరోవైపు అడుగేశా
రాళ్లదారి-మరింత రక్తం కారింది
అసహనంతో అడుగులనే ఆపేశా
రక్త ప్రవాహం పెరిగిందే కానీ తగ్గలేదు అప్పుడనిపించింది మిగిలింది పూల దారే అని,అడుగుల వేగం పెంచి పొంగే నదిలా కదిలా,నా పాదాల కింద పూలు నలిగిపోతున్న ఏమో అని జాలిగా చూశా,
ఆ పూలు నా పాదాల నుండి వచ్చే రక్తాన్ని పీల్చుకుని ఎర్రగా మారాయి.నేను నదిలా కదిలినంత కాలం ఎంతో మంది వారి ఆర్తిని తీర్చుకున్నారు,నువ్వే దైవం అన్నారు,నేను పొరిలి పొంగి సంద్రాన కలిసిన నాడు
నేను లేను కనిపించలేను! కానీ నా కాళ్ళకింద నలిగిన పూలు నన్నుఅడిగాయి
పరిమళాన్ని ఇస్తూ అందర్నీ ఆనందింపజేసే సుకుమారమైన మమ్మల్ని ఇలా చచ్చిన శవంల ఎర్రని ముద్దుల చేసావే నీకు ఏమి కలిసొచ్చింది?చివరికి నువ్వు లేవు -జీవించి లేవు ,నేను లేను-కనిపించలేను.


20 

Share


సన్నిధి రాజు శివ సుబ్రహ్మణ్యం
Written by
సన్నిధి రాజు శివ సుబ్రహ్మణ్యం

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad