Bluepadతెలుగు పాటల తో ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్
Bluepad

తెలుగు పాటల తో ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్

A
Ananth A.
19th Jun, 2020

Share

అయితే ఇంట్లో ఉంటూ నటులు క్రికెటర్లు వివిధ రకాల వంటలు హెయిర్ స్టైల్స్ చేస్తుంటే వార్నర్ మాత్రం డాన్స్ టిక్ టాక్ తో ఫుల్ జోష్ తో ఎంటర్ టైన్ చేస్తున్నాడు. నిజంగా వారు చేసిన వీడియోలు చూస్తూ ఉంటే ఫుల్ మజా ఎవరికైనా రావాల్సిందే. వార్నర్ భార్య కాండీస్ ఐరన్ వుమెన్. అతడు డాన్సింగ్ టాలెంట్ వెనుక ఆమె ప్రభావం ఉందో వీడియోలు చూస్తే అర్థమవుతుంది.




అల్లు అర్జున్ బుట్ట బొమ్మ పాటకి వార్నర్ తన సతీమణి కాండీస్ తో కలిసి ఒక ఊపు ఊపించాడు. కరోనా విజృంభించడం ఎవరి ఇళ్లలో వారే ఉండటం వలన వార్నర్ తన అభిరుచులు బయటకు తీస్తున్నాడు. అందు లో భాగమే షార్ట్ వీడియో షేరింగ్ ఆప్ అయితే తన ఐదేళ్ల కూతురు కోరిక మేరకు వార్నర్ ఇలా వచ్చాడట. దీని గురించి తనకు తెలియదంటూ వాళ్ళే సహాయం చేయాలి అంటూ అభిమానుల్ని పలకరించడం జరిగింది.

అయితే వార్నర్ టిక్ టాక్ లో వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్నీ ఎంత గానో మెప్పించాడు. కత్రినాకైఫ్ సాంగ్ కి తన కూతురు తో కలిసి సరదాగా స్టెప్పులు వేశాడు. ఇలా వీడియో పోస్ట్ చేసాడో లేదో కానీ వెంటనే లక్షల్లో వీక్షించారు ప్రజలు. అలా మొదలైంది వార్నర్ టిక్ టాక్ వీడియోలు అల్లు అర్జున్ బుట్ట బొమ్మ, రాములో రాముల పాట తో మరింత ఫేమస్ అయిపోయాడు. ఆ తర్వాత మహేష్ బాబు బ్లాక్ బస్టర్ జూనియర్ ఎన్టీఆర్ పక్కా లోకల్ పాటలు కూడా డాన్స్ చేశాడు. వార్నర్ ఆ తర్వాత బాహుబలి సినిమా లో అమరేంద్ర బాహుబలి గెటప్ వేసుకుని ప్రజలందరూ ఆశ్చర్యపరిచాడు వార్నర్. ఇలా వార్నర్ తో పాటు భార్యా పిల్లలతో అందర్నీ అలరించాడు.

బాలీవుడ్ తారలు డైలాగులకు వార్నర్ అద్భుతంగా నటించాడు. వార్నర్ శిల్పా శెట్టి ఫన్నీ ఫేస్ తో చేసిన వీడియో కి వార్నర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నిజంగా అందరినీ నవ్వించాయి. అంతే కాకుండా సామాన్యుల ప్రతి పని కూడా ప్రోత్సహిస్తూ వార్నర్ టిక్ టాక్స్ ఎన్నో చేశాడు క్రికెట్ వల్ల ఎప్పుడూ సమయం ఉండని వార్నర్ ఇప్పుడు చక్కగా తన కుటుంబం తో కలిసి జాలిగా గడుపుతున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు వార్నర్ . గతం లో తనకు హార్స్ రైడింగ్ అంటే పిచ్చి కానీ ఇప్పుడు వార్నర్ ఖాళీ సమయం దొరికితే చాలు పిల్లల తో భార్య తో కలిపి టిక్ టాక్ లు చేస్తూ ఉన్నాడు.

అంతే కాకుండా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా టిక్ టాక్ లోకి రమ్మని అడిగాడు. దీనిపై జట్టు సభ్యుడు రవిచంద్రన్ అశ్విన్ తో ఇన్స్టా లైవ్ లో కోహ్లీ మాట్లాడాడు నన్ను కూడా వీడియోలు చేయమని వార్నర్ వెంటపడుతున్నాడు వదలడం లేదు నేను ఇంకా ఏ విషయం చెప్పలేదు అని సరదాగా అన్నాడు విరాట్ కోహ్లీ.


13 

Share


A
Written by
Ananth A.

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad