Bluepadబ్రతుకు వేదన...!!
Bluepad

బ్రతుకు వేదన...!!

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
19th Jun, 2020

Share

*బ్రతుకు వేదనా...!!*

మనసు వేదన
ఆలోచన శోధన
కలిసి రాని కాలంలో
బ్రతుకంతా భారమే...!!

నిన్నటికి ఈరోజు తెలియదు
నేటి రోజుకు నష్టమని
రేపటికి ఆందోళనలు వస్తాయని
జీవితం సాఫీగా సాగదని...!!

గడిచిన కాలం ఒక స్వప్నం
గడుస్తున్నది భయంకరం
గడిచే కాలం అంధకార చీకట్లు
తలుచుకుంటేనే నరకము..!!

ఉన్న వాడిది సాగుతోంది
లేని వాడిది గతించింది
మధ్య వాడిది ఊగిసలాట
గాలిలోనే ప్రాణం తిరుగుతుంది...!!

అనుభవం నేర్పిన పాఠాలు
ఆశల పల్లకి కాదు జీవితాలు
క్షణాల్లో మారుతున్న బతుకులు
వీధిన పడుతున్న సంసారాలు...!!

ఆనంద సాగరంలో రాళ్లు తేలి
అడుగడుగునా తగులుతున్నాయి
ముత్యాల కోసం వెతుకుతుంటే
కడలిలోనే ప్రాణం పోతుంది...!!

*కొప్పుల ప్రసాద్*
*నంద్యాల*

16 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad