Bluepadకౌముది కాంతులు విరిసే..!
Bluepad

కౌముది కాంతులు విరిసే..!

ఆనిరాజ్ కూచిపూడి
ఆనిరాజ్ కూచిపూడి
19th Jun, 2020

Share


వసంతాలు గతించిపోతున్నా
గుంభనమైన నీ వైఖరికి..!
హృదయ దొన్నెలలో నిండిన కన్నీరు
కడలిలా కల్లోలం సృష్టిస్తున్న వేళ..!!

నా మదిని తాకిన నీ చూపుల సందేశం
కౌముది కాంతులతో విరిసే.!
నిశీధి సంద్రంలో వెలుగు పూలు వికసించగా
అలలు అమృత కిరణాలై మెరిసే..!!

నీ చిరునవ్వు సుధలే చిలకగా
విప్రలంభ ఘడియలు అంతర్ధానమయ్యే..!
దొనదొనమను మరంద ప్లావనమున
మనసు పరవశించే..!!

లలిత లావణ్య లాసక లాస్యము
ఎద రెప్పలు వీక్షించి పలవరించే..!
భాషే ఎరగని ఎల్లలు తెలియని
మధుర భావనలు విరచించే..!!

పాల కన్న స్వచ్ఛమైన నా ప్రేమను
అంగీకరించిన నిను కలుసుకోవాలని
నీ ఆహ్వానం కోసం పరితపిస్తున్నా..!
నీ హృది వాకిట నిరీక్షిస్తున్నా..!!

-- ఆనిరాజ్ కూచిపూడి
సత్తెనపల్లి

10 

Share


ఆనిరాజ్ కూచిపూడి
Written by
ఆనిరాజ్ కూచిపూడి

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad