Bluepadఏది ఏదైనా
Bluepad

ఏది ఏదైనా

S
Surya_Kolluri
19th Jun, 2020

Share

ఏది స్వర్గం
ఏది నరకం
ఏదైనా ఆలోచనల మాయ మొత్తం
ఏది కష్టం
ఏది నష్టం
ఏది లేనిదే మారదు ఆ శూన్యం
ఏది తప్పు
ఏది ఒప్పు
ఏదైనా అది నీ నిన్నటి నిర్ణయం
ఏది గెలుపు
ఏది తలంపు
ఏది ఏమైనా నిలవదు కలకాలం
ఏది దైవం
ఏది దెయ్యం
ఏదైనా భయాలకు వెతికే ధైర్యం
ఏది చీకటి
ఏది వెలుతురు
ఏదైనా నీ మదికి అందిన రూపం
ఏది పాపం
ఏది పుణ్యం
ఏదైనా నీ కోసమే చేసే కర్తవ్యం
ఏది శూన్యం
ఏది శతకం
ఏదైనా మొదలయ్యే సంఖ్య ఏకం
ఏది దైవత్వం
ఏది మూర్ఖత్వం
ఏ నిజం ఎవరెగిన వేదాంతం
ఏది మంచి
ఏది చెడు
ఏది ఎంటో తెలియని మస్తిస్కం
ఏది స్వరాజ్యం
ఏది బానిసం
ఏదైనా పైవోడి పై ఆధారం
ఏది ప్రశ్న
ఏది జవాబు
ఏదైనా నీనుండే మొదలైన తత్వం
ఏది తెలుపు
ఏది నలుపు
ఏదైనా నిశిన కనుమరుగవు గుణం
ఏది పల్లము
ఏది ఎత్తువు
ఏదైనా మిగిలేది ఆరుఅడుగుల స్ధలం
ఏది ధనికం
ఏది పేదరికం
ఏమున్నా మనశ్శాంతి ఉనికి ప్రశ్నార్ధకం
ఏది సత్యం
ఏది అసత్యం
ఏదైనా నిన్ను కప్పే నీ ఆయుధం
ఏది నీవు
ఏది నేను
ఎవరు ఎవరో ఎవరికి ఎవరో దైవనిర్ణయం



15 

Share


S
Written by
Surya_Kolluri

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad