Bluepadఅమరవీరులు
Bluepad

అమరవీరులు

బంధకవి రామారావు
18th Jun, 2020

Share

# అమరవీరులు #
ప్రతి జననం కి
మరణం అనివార్యం !
ఆ మరణం వీరమరణం,
అయితే , ఆ త్యాగానికి,
మనమేమి ఇవ్వగలం?
ఎంతని కొనియాడగలం?

హిమాలయాలకంటే ఉన్నతమైన వారి సాహసం,
బంగాళా ఖాతం కంటే లోతైన వారి దేశ భక్తి, ఏమిచ్చినా సాటిరాని , లేని వారి త్యాగం, అహర్నిశలు వారు చూపే నిబద్దత కి, అమర్రహే అంటూ ఆవేదన భరిత అశృనివాళి తప్ప, !

ప్రాణాల్ని సైతం, ఏ బంధం,
బంధుత్వం లేని జనాల కోసం,
తమ బంధాలను మరచి,
నిస్వార్ధంగా, నిజాయితీ తో,
అసువులు బాసే, అమరవీరులకు, అశ్రునయనాలతో, అంజలిఘటించి
నివాళులీయడం, మన ధర్మం !

శత్రుమూకల, శస్త్ర దాడిలో,
ఉగ్రవాదుల ఉన్మాదంలో,
దేశ రక్షణా మహా యజ్ఞంలో,
ప్రజల ప్రాణ పరిరక్షణలో,
నిత్యం, తమ అమూల్య జీవితాలను,
పణంగాపెట్టి, వీరమరణంతో
అమరత్వం పొందే
అమరవీరులారా, మీకిదే మా అంజలి !
మీ త్యాగనిరతికి, మా శ్రద్ధాంజలి🙏


14 

Share


Written by
బంధకవి రామారావు

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad