Bluepadమనసు వేదన...!!
Bluepad

మనసు వేదన...!!

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
18th Jun, 2020

Share

*మనసు వేదన...!!*

మనసంతా వెలితిగా ఉంది
శూన్యాన్ని చుట్టి రావాలని
మనసు వేదన తో నిండే..!!

అవసరానికి రాని అనుబంధాలు
ఎక్కరిస్తూ కూర్చున్నాయి
అందని ఆకాశం
అందరికీ ఆనందం పంచుతున్నట్లు.

స్వప్నాలు చెదిరిపోయి
కన్నీరు ఆవిరై
జ్ఞాపకాలు తోడై
అనుభవాలు ఆశలతో వెంటాడుతున్నాయి..!!

కనిపించిన నిజం
ఒంటరిగా రోదిస్తోంది
వాలిపోయిన బ్రతుకులు
మిగిలిన జీవితానికి నిజమై నిలిచింది...!!

కన్నీళ్లు ఎదురుచూస్తున్నాయి
పడుకునే సమయంలో
రెప్పల నుంచి కన్నీటిని ఆపాలని
హృదయానికి ఆయుష్షు పెంచాలని..!!

ఏకాంతము ఏడుస్తుంది
వయసు సహకరించక
వినిపిస్తున్న శరీర రోదనలకు
పైన కనిపించే అలంకారాలను చూసి..!!

*కొప్పుల ప్రసాద్*
*నంద్యాల*

19 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad