నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. నటుడు మాత్రమే కాకుండా సంగీత కర్త గాయకుడు దర్శకుడు నిర్మాతగా అతను పని చేశారు ఈయన చేసిన పాత్రలకు ప్రజాదరణ ఎంతో పొందింది అవే పోతన త్యాగయ్య వేమన రామదాసు వంటి పాత్రలు దక్షిణ భారతదేశంలోనే పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి నటుడు నాగయ్య ఈయన మొత్తం 336 సినిమాల్లో నటించారు. నాగయ్య చిత్తూరు లో ఉన్నప్పుడు సురభి నాటక మండలి వారు భక్త ప్రహ్లాద నాటకం ప్రదర్శించడానికి వచ్చారు. ఆ నాటకం లో ప్రహ్లాదుడు పాత్ర వేయాల్సిన ఒక అబ్బాయికి జ్వరం రావడం తో నాగయ్య తొలి సారిగా నాటకం లో ప్రహ్లాదుని పాత్ర పోషించారు. ఆరోజు ప్రేక్షకులు బంధువులు శ్రేయోభిలాషులు ఎంతో అభినందించారు. ఇలా అనేక పాత్రలు నాటకాల్లో వేసి అందరినీ మెప్పించేవారు.
నాటక రంగం నుండి ప్రవేశం తో మహా నటులైన బళ్ళారి రాఘవ పర్వతనేని రామచంద్రారెడ్డి మొదలగు వారితో కలిసి పలు నాటకాల్లో ప్రదర్శించి అభినందనలు పొందేవాడు ఈయన రంగ ప్రవేశం కబీరు వేషం తో మొదలైంది ప్రేక్షకులందరూ తెచ్చుకున్నారు ఈయన నటన కౌశల్ కౌశలాన్ని నేర్చుకొని బంగారు పతకంతో పాటు రంగ భూషణ అనే బిరుదు కాశీనాధునిచే నాగేశ్వరరావు ఇవ్వబడింది. 1932 నుండి నాగయ్య సినీరంగంలో ప్రవేశించడానికి ప్రయత్నాలు చేశారు. కాక పోతే నటుడిగా కాకుండా సంగీత విభాగం లోనూ నిర్మాతగా దర్శకుడిగా అవకాశం వచ్చింది గాని అతని నటనకు అక్కడ అవకాశం దక్కలేదు ఆ వాతావరణం అతనకు నచ్చక పోవడం వల్ల తిరిగి మద్రాసు వచ్చేశాడు.
మద్రాస్ లో మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టి ప్రముఖ కవులని కలిసి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు ఆ సమయంలో అతని దగ్గర కాస్త డబ్బులు మాత్రమే ఉండేవి ఆ డబ్బులు జాగ్రత్త పెట్టి సినిమా తీద్దామని అతనికి ఉండేది
అతని దగ్గర ఉన్న సొమ్ముతోనే ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని బయటకు రాకుండా సంగీత సాధన చేస్తూ ఉండేవాడు ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొని సినిమాలో నటునిగా అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు ఆఖరికి 1936లో హెచ్.ఎం.రెడ్డి బి.ఎన్.రెడ్డి రామ్నాథ్ ఇతరులు తో కలిసి రోహిణి పిక్చర్స్ అనే పేరుతో సంస్థ ప్రారంభించడం జరిగింది ఈ సంస్థలో గృహలక్ష్మి అనే సినిమా తీద్దామని నిశ్చయించుకున్నారు ఈ సినిమాలో నాగయ్య పాటలు పాడిన తీరుతో అతను కు మంచి పేరు వచ్చింది మరియు అతని మొదటి చిత్రంలోనే మంచి నటుడు అని పేరు సంపాదించుకున్నారు
ఇలా అనేక సినిమాలు తీస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎన్నో పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు అతను మాట తీరు చిరునవ్వు శాంతం ఇలా ఎన్నో మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి నాగయ్య ప్రతి కళాకారిణి సమానంగా చూసి దానధర్మాలు కూడా చేశాడు. దీంతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నా, వ్యక్తిత్వం కూడా మంచిది అని ముద్ర పడింది.