Bluepadగత స్మృతులు...!!
Bluepad

గత స్మృతులు...!!

కొప్పుల ప్రసాద్
కొప్పుల ప్రసాద్
17th Jun, 2020

Share

#గత_స్మృతులు..!!

ఆస్తులు అంతస్తులు వద్దు
వీలైతే చింత లేని బాల్యం
ఎవరైనా ఇంకొక సారి
నాకు అందివ్వ గలరా..!!

ఊరి బయట పొలాలలో
పాడుపడ్డ ఇళ్లలో
ఆడిన ఆటలు అన్ని
పాడిన పాటలు అన్ని
మూటగట్టి మురిపంగా ఇవ్వగలరా..!!

అవ్వ తాతలు పంచిన జ్ఞాపకాల నిధులను
అమ్మ ఒడిలోని చల్లదనాన్ని
నాన్న జతలోని ఆనందాన్ని
బాల్యపు అనుభూతులను పంచి ఇవ్వగల రా..!!

వీధి బడిలో నేర్పిన చదువులు
పెద్దబాలశిక్ష లోని పద్యాలు
దేవాలయంలో తీర్చిన మొక్కులు
కాలువలో వదిలిన కాగితపు పడవలు
చెట్లెక్కి తిన్న ఫలాలు
అలాంటి రుచులు అందివ్వగలరా..!!

తెల్లవారుజామున కోడి కూతలు
చెట్ల పైన కోయిల పాటలు
వాగుల్లో చేపల వేటలు
నలుగురితో కలిసి తిన్న సద్దులు
ఒక్కసారైనా తిరిగి చెయ్యగలరా..!!

పాల ఐస్ కోసం పరుగులు
వీధి అరుగు కాడి ఆటలు
బొంగరం చీల్చిన జ్ఞాపకాలు
జేబులో గోలిలా సవ్వడులు
ఆడిన ఆటలు మధుర క్షణాలు ఇవ్వరా..!!

పీర్ల పండగ సందడులు
దేవాలయాలలోని భజనలు
రామాలయం లోని పాటలు
కనువిందు చేసిన సరదాలు
మళ్లీ ఒక్కసారి గత స్మృతులు తిరిగి ఇవ్వగలరా..!!

#కొప్పుల_ప్రసాద్
#నంద్యాల

20 

Share


కొప్పుల ప్రసాద్
Written by
కొప్పుల ప్రసాద్

Comments

SignIn to post a comment

Recommended blogs for you

Bluepad